ఇంధన మార్కెట్ స్థిరత్వానికి అమెరికా కీలక నిర్ణయం..

ఇంధన మార్కెట్ స్థిరత్వానికి అమెరికా కీలక నిర్ణయం

Advertisements

<p>ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా నెలకొన్న సంక్షోభం వేళ అమెరికా భారత్ కు గుడ్ న్యూస్ చెప్పింది&period; ఇరాన్&comma; ఇజ్రాయెల్ మధ్య రెండో దశ దాడులకు రంగం సిద్ధమవుతున్న క్రమంలో&comma; అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తకుండా ఇంధన మార్కెట్ స్థిరత్వానికి అమెరికా ఒక కీలక నిర్ణయం తీసుకుంది&period; జూన్ 17 వరకు అంతర్జాతీయ మార్కెట్ నుండి రష్యా క్రూడాయిల్‌ను కొనుగోలు చేసుకోవచ్చని ప్రపంచ దేశాలకు వైట్ హౌస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది&period; అప్పటివరకు రష్యాపై గతంలో విధించిన ఆర్థిక ఆంక్షల నుంచి పూర్తి మినహాయింపు ఉంటుందని యుఎస్ ఫైనాన్స్ మినిస్టర్ స్కాట్ అధికారికంగా ప్రకటించారు&period; పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల వేళ&period;&period; ఇంధన ధరలు ఆకాశాన్నంటకుండా నిరోధించేందుకు అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం&comma; రష్యా నుండి భారీగా చమురు దిగుమతి చేసుకునే భారతదేశానికి ఒక పెద్ద శుభవార్తగా&comma; ఊరటగా మారింది&period;<br &sol;>&NewLine;&lpar;&rpar;అమెరికా ప్రకటించిన ఈ తాజా మినహాయింపులతో రష్యా నుంచి తక్కువ ధరకే ఆయిల్ కొనుగోళ్లను భారత్ మరింత భారీగా పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు&period; అయితే&comma; అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాలు&comma; అమెరికా ఆంక్షలతో సంబంధం లేకుండా &period;&period;తాము దేశీయ ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నామని భారత ప్రభుత్వం నిన్ననే స్పష్టం చేయడం గమనార్హం&period; ఏదేమైనప్పటికీ&comma; ఇరాన్ పరిణామాల నేపథ్యంలో చమురు ధరలు పెరగకుండా అమెరికా ఇచ్చిన ఈ వెసులుబాటు&period;&period; అటు భారత ఆర్థిక వ్యవస్థకు&comma; ఇటు దేశీయంగా పెట్రోల్&comma; డీజిల్ ధరలు స్థిరంగా ఉండేందుకు ఎంతగానో దోహదపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..