H-1B వీసాదారులకు ట్రంప్ సర్కార్ మరో షాక్.

Advertisements

<p>అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు&comma; ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది&period; ఉద్యోగం కోల్పోయిన H-1B వీసాదారులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించేలా అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం కొత్త ప్రతిపాదన చేసింది&period; ఉద్యోగం పోయిన తర్వాత మరో ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా అమెరికా నుంచి తిరిగి వెళ్లేందుకు ఇస్తున్న రెండు నెలల గడువును రద్దు చేసే దిశగా ప్రతిపాదన వచ్చింది&period; ఈ మార్పు H-1Bతో పాటు L-1&comma; O-1&comma; TN వంటి ఇతర వర్క్ వీసాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p>అమెరికన్లకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించడమే లక్ష్యంగా ఈ మార్పులు ప్రతిపాదించినట్లు ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది&period; విదేశీ ఉద్యోగులను త్వరగా భర్తీ చేసుకునే అవకాశం తగ్గితే&period;&period; కంపెనీలు అమెరికన్లను నియమించుకునే అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు&period; అయితే ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం పడే అవకాశం ఉంది&period; ఉద్యోగం కోల్పోయిన వెంటనే కొత్త ఉద్యోగం వెతుక్కోవడం&comma; కుటుంబాన్ని తరలించడం&comma; ఇల్లు-పిల్లల చదువులకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం వారికి పెద్ద సవాలుగా మారనుంది&period;<&sol;p>&NewLine;<p>అయితే ప్రస్తుతం 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దు కాలేదు&period; తాజా ప్రతిపాదనపై 60 రోజుల పాటు ప్రజలు&comma; కంపెనీల నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నారు&period; ఆ తర్వాత వచ్చిన సూచనలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది&period; ప్రతిపాదన అమల్లోకి వస్తే భారతీయ ఐటీ నిపుణులతో పాటు అమెరికాలో H-1Bపై ఆధారపడిన కుటుంబాలు&comma; కంపెనీలపై కూడా గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.