బ్రిక్స్ సదస్సు సందర్భంగా పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.

Advertisements

<p>బ్రిక్స్ సదస్సు-2026 నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ&comma; రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి&period; ఈ సందర్భంగా ప్రధాని మోదీ&comma; పుతిన్‌కు ఒక విశిష్టమైన సాంస్కృతిక కానుకను అందజేశారు&period; ప్రాచీన తమిళ సాహిత్య గ్రంథమైన &&num;8216&semi;తిరుక్కురళ్&&num;8217&semi; రష్యన్ అనువాద ప్రతిని ఆయనకు బహూకరించారు&period; సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు ఎంతో ఆత్మీయంగా పలకరించుకున్నారు&period; పరస్పరం కరచాలనం చేసుకుని&comma; ఆలింగనం చేసుకున్నారు&period; ఈ భేటీలో పలు అంతర్జాతీయ&comma; ద్వైపాక్షిక అంశాలపై వారు కూలంకషంగా చర్చించినట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;<p>ప్రధాని మోదీ బహూకరించిన తిరుక్కురళ్ తమిళ సాహిత్యంలో అత్యంత ప్రాముఖ్య&comma; గౌరవం పొందిన గ్రంథాల్లో ఒకటి&period; దీనిని సుప్రసిద్ధ కవి&comma; తత్వవేత్త తిరువళ్లువర్ రచించారు&period; ఇందులో నీతి&comma; నైతికత&comma; ప్రేమ&comma; సంపద&comma; పాలన&comma; మానవ ప్రవర్తన వంటి అనేక అంశాలపై 1&comma;330 పద్యాలు ఉన్నాయి&period; ఈ గ్రంథం అర్థవంతమైన&comma; నైతిక జీవితాన్ని ఎలా గడపాలో తెలియజేసే మార్గదర్శిగా ప్రసిద్ధి చెందింది&period; ఇందులోని అంశాలు సార్వత్రికమైనవి కావడంతో&comma; భాష&comma; సంస్కృతి&comma; దేశాల సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది&period; ఇప్పటికే అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడిన ఈ గ్రంథం రష్యన్ అనువాదాన్ని పుతిన్‌కు అందించడం ద్వారా&comma; విశ్వమానవ విలువలను చాటిచెప్పే భారతీయ సాహిత్య వారసత్వాన్ని నరేంద్ర మోదీ ఆయనకు పరిచయం చేసినట్టయింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.