త్వరలోనే చమురు మార్కెట్లు తీవ్ర ప్రమాదకర స్థాయిలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని ‘అంతర్జాతీయ ఇంధన సంస్థ’…

త్వరలోనే చమురు మార్కెట్లు తీవ్ర ప్రమాదకర స్థాయిలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని 'అంతర్జాతీయ ఇంధన సంస్థ'

Advertisements

<p>ప్రపంచవ్యాప్తంగా ఇంధన నిల్వలు వేగంగా క్షీణిస్తుండటంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు &&num;8216&semi;రెడ్ జోన్&&num;8217&semi; లోకి ఎంటర్ అయ్యే ప్రమాదం ఉందని IEA తెలిపింది&period; త్వరలోనే చమురు మార్కెట్లు తీవ్ర ప్రమాదకర స్థాయిలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని &&num;8216&semi;అంతర్జాతీయ ఇంధన సంస్థ&&num;8217&semi; చీఫ్‌ ఫాతిహ్‌ బిరోల్‌ హెచ్చరించారు&period; లండన్‌లో నిర్వహించిన ప్రపంచ ఇంధన భద్రత ప్రత్యేక సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు&period; ముఖ్యంగా ఇరాన్ యుద్ధ వాతావరణం కారణంగా తలెత్తిన ఈ అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే&period;&period; అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన &&num;8216&semi;హర్ముజ్ జలసంధి&&num;8217&semi;ని ఎలాంటి షరతులు లేకుండా&comma; పూర్తిగా తిరిగి తెరవడమే ఏకైక పరిష్కార మార్గమని ఆయన స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>ఒకవేళ హర్మూజ్ జలసంధిని యథాతథంగా తెరవడంలో విఫలమైతే&comma; పశ్చిమాసియా దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా జరిగే చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోతుందని&comma; దీనివల్ల వివిధ దేశాల్లో చమురు నిల్వలు అట్టడుగు స్థాయికి పడిపోతాయని బిరోల్ వివరించారు&period; ఈ ఇంధన సంక్షోభం ప్రారంభమైన కొత్తలో ప్రపంచ దేశాల వద్ద అవసరానికి మించి మిగులు చమురు నిల్వలు ఉన్నప్పటికీ&comma; ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా అవి వేగంగా కరిగిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు&period; దీనికి తోడు&comma; రాబోయే వేసవి కాలంలో ప్రయాణాలు విపరీతంగా పెరిగి ఇంధనానికి డిమాండ్ మరింత ఎక్కువ కానుందని&comma; ఈ రెండు కారణాల వల్ల రాబోయే జులై లేదా ఆగస్టు నెలల నాటికి ప్రపంచ చమురు మార్కెట్లు మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే గండం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..

యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం..