అమెరికా జాతీయ నిఘా విభాగాధిపతి పదవికి తులసి గబార్డ్ రాజీనామా..

అమెరికా జాతీయ నిఘా విభాగాధిపతి పదవికి తులసి గబార్డ్ రాజీనామా

Advertisements

<p>అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్‌&comma; భారత సంతతి మహిళ తులసి గబార్డ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు&period; తన భర్త అబ్రహం విలియమ్స్‌కు అరుదైన బోన్ క్యాన్సర్ సోకినందున&comma; ఆయనకు తోడుగా ఉండేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు&period; ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పంపిన తన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పంచుకున్నారు&period; ఆమె రాజీనామా జూన్ 30&comma; 2026 నుంచి అమలులోకి వస్తుంది&period;<br &sol;>&NewLine;తులసి రాజీనామాను ఆమోదించిన అధ్యక్షుడు ట్రంప్&comma; ఆమె సేవలను ప్రశంసించారు&period; &&num;8220&semi;తులసి అద్భుతంగా పనిచేశారు&comma; ఆమె లేని లోటు మాకు తెలుస్తుంది&comma;&&num;8221&semi; అని ఆయన వ్యాఖ్యానించారు&period; ప్రిన్సిపల్ డిప్యూటీ డైరెక్టర్ ఆరోన్ లూకాస్ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని వైట్‌హౌస్ ప్రకటించింది&period; ఫిబ్రవరి 2025లో బాధ్యతలు స్వీకరించిన తులసి సుమారు 15 నెలల పాటు ఈ పదవిలో ఉన్నారు&period; అయితే&comma; ఇరాన్ విషయంలో ట్రంప్ విధానాలతో ఆమె విభేదించారని&comma; ఒత్తిడి కారణంగానే రాజీనామా చేశారని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి&period; కానీ&comma; ఈ ప్రచారాన్ని తులసి కార్యాలయంతో పాటు వైట్‌హౌస్ కూడా ఖండించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..