‘ఎబోలా’ వైరస్ ముప్పుపై కేంద్ర హై అలర్ట్..

'ఎబోలా' వైరస్ ముప్పుపై కేంద్ర హై అలర్ట్

Advertisements

<p>ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాధి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది&period; ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలాను అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం నిఘా పెంచింది&period; ఈ నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సీనియర్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు&period; దేశంలో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది&period; వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది&period;<&sol;p>&NewLine;<p>దేశంలోని విమానాశ్రయాలు&comma; సముద్ర తీర పోర్టులు&comma; అంతర్జాతీయ సరిహద్దుల్లో ఎబోలా స్క్రీనింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు&period; అలాగే వైరస్ గుర్తింపు&comma; టెస్టింగ్&comma; నిఘా చర్యలను మరింత బలోపేతం చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్&comma; నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంస్థలకు సూచనలు చేశారు&period; కేంద్రమంత్రి ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ కార్యదర్శి వివిధ శాఖలు&comma; ఏజెన్సీల ఉన్నతాధికారులతో సమావేశమై వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..