భారత్‌లో వ్యక్తిగత పర్యటనలో టిఫానీ ట్రంప్‌..

భారత్‌లో వ్యక్తిగత పర్యటనలో టిఫానీ ట్రంప్‌

Advertisements

<p>అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె టిఫానీ ట్రంప్‌ ప్రస్తుతం భారత్‌లో వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు&period; ఈ సందర్భంగా ఆమె నారాయణ్‌ అక్షరధామ్‌ ఆలయాన్ని సందర్శించారు&period; ఆలయంలోని అద్భుత శిల్పకళ&comma; నిర్మాణ వైభవాన్ని చూసి టిఫానీ ట్రంప్‌ మంత్రముగ్ధులయ్యారు&period; ఆలయ ప్రాంగణంలో ఇటీవల ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తైన నీలకంఠ్‌ వర్ణీ విగ్రహాన్ని కూడా దర్శించుకున్నారు&period; ఈ సందర్శనకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్‌ మీడియాలో పంచుకుని&comma; ఆలయ సౌందర్యంపై ప్రశంసలు కురిపించారు&period; వ్యక్తిగత పర్యటనలో భాగంగా టిఫానీ త్వరలో ఆగ్రాకు వెళ్లి ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్‌ మహల్‌ను సందర్శించనున్నారు&period; అక్కడ సుమారు గంటన్నర పాటు గడిపిన అనంతరం జైసల్మేర్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది&period; ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనదే అయినప్పటికీ&comma; భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు&period;కాగా&comma; టిఫానీ ట్రంప్‌కు ఇది తొలి భారత పర్యటన కాదు&period; 2018లో తండ్రి డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా ఆమె కూడా భారత్‌కు వచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..