280 మందికిపైగా చిన్నారుల కిడ్నాప్:
నైజీరియా(Nigeria)లోని పాఠశాలలపై సాయుధ మూకలు దాడి చేసి, భారీ సంఖ్యలో విద్యార్థులను అపహరించుకెళ్లారు. ఏకంగా 280 మందికిపైగా చిన్నారులను కిడ్నాప్ చేశారు. కడునా రాష్ట్రంలోని చికున్ జిల్లాలోని పాఠశాలల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. నైజీరియాలో ఇటువంటి ఘటనలు సాధారణమే అయినప్పటికీ.. ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులను కిడ్నాప్ చేయడం సంచలనం రేపుతోంది.
కలకలం రేపుతున్న విద్యార్థుల కిడ్నాప్ కేసులు..
కురిగా పాఠశాల ప్రాంగణంలోకి ముష్కరుల గుంపు ప్రవేశించింది. గాల్లోకి కాల్పులు జరుపుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. పలువురు విద్యార్థులతో పాటు సిబ్బంది చాకచక్యంగా తప్పించుకున్నప్పటికీ.. ఓ టీచర్‌తో పాటు దాదాపు 187 మందిని అపహరించుకెళ్లారని అధికారులు తెలిపారు. మరో ప్రైమరీ పాఠశాల నుంచి 125 మందిని కిడ్నాప్ చేయగా, వారిలో 25 మంది తప్పించుకున్నారని. ఇలా మొత్తంగా 280 మందికి పైగా చిన్నారులను ఎత్తుకెళ్లినట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ఇజ్రాయెల్ పై క్షిపణి దాడిలో భారతీయుడు మృతి..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి