235
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి శరవేగంగా జరుగుతున్న వేళ రామయ్యకు అత్తారింటి నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. సీతాదేవి జన్మించిన నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి 3 వేలకు పైగా బహుమానాలు అయోధ్యకు చేరుకున్నాయి. వీటిలో వెండి పాదరక్షలు, ఆభరణాలు, దుస్తులు, వెండివిల్లు వంటివి ఉన్నాయి. జనక్‌పూర్‌లోని రామ్‌జానకి ఆలయ పూజారి రామ్ రోషన్‌దాస్ వీటిని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందించారు. 800 మంది భక్తులు 500 డబ్బాల్లో 30 వాహనాల్లో కాన్వాయ్‌గా ఈ బహుమతులను తీసుకొచ్చారు. వీటిలో పండ్లు, స్వీట్లు, బంగారు, వెండి వస్తువులు, డ్రైఫ్రూట్స్, నేపాల్ సంప్రదాయ మిఠాయిలు వంటివి ఉన్నాయి.