Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home National మోదీ గుజరాత్ పర్యటన..

మోదీ గుజరాత్ పర్యటన..

by Satya
Prime Minister Narendra Modi

రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌తో పాటు ఇతర కార్యక్రమాలలో పాల్గొంటారు. అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ ఒ‍క ట్వీట్ చేశారు. తాను ఈ రెండు రోజులు వైబ్రంట్ గుజరాత్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నానని, ఈ శిఖరాగ్ర సదస్సులో పలువురు ప్రపంచ నేతలు పాల్గొనడం సంతోషకరమని అన్నారు. తన సోదరుడు మహమ్మద్ బిన్ జాయెద్ రాక ప్రత్యేకమైనదని, వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌తో తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు. ఈ వేదిక గుజరాత్ అభివృద్ధికి ఎంతో దోహదపడింది. దీని ద్వారా చాలా మందికి అవకాశాలను సృష్టించినందుకు సంతోషిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

008589
Total views : 56900

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.