అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి శరవేగంగా జరుగుతున్న వేళ రామయ్యకు అత్తారింటి నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. సీతాదేవి జన్మించిన నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి 3 వేలకు పైగా బహుమానాలు అయోధ్యకు చేరుకున్నాయి. వీటిలో వెండి పాదరక్షలు, ఆభరణాలు, దుస్తులు, వెండివిల్లు వంటివి ఉన్నాయి. జనక్‌పూర్‌లోని రామ్‌జానకి ఆలయ పూజారి రామ్ రోషన్‌దాస్ వీటిని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందించారు. 800 మంది భక్తులు 500 డబ్బాల్లో 30 వాహనాల్లో కాన్వాయ్‌గా ఈ బహుమతులను తీసుకొచ్చారు. వీటిలో పండ్లు, స్వీట్లు, బంగారు, వెండి వస్తువులు, డ్రైఫ్రూట్స్, నేపాల్ సంప్రదాయ మిఠాయిలు వంటివి ఉన్నాయి.
ayodya
ప్రస్తుతం దేశవ్యాప్తంగా విదేశాలతో పాటు వినిపిస్తున్న మాట అయోధ్య రామాలయం. కనీవినీ ఎరిగిన రీతిలో వందల కోట్లతో అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతోంది. ఈ రామాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా పెట్టేసారు. ఇలాంటి నేపథ్యంలో అయోధ్య రాముని సేవకు అంకితమైన చల్లా శ్రీనివాస శాస్త్రి పాదయాత్రగా బయలుదేరి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాకినాడ రూరల్ లోని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందని కలిచారు. వందల సంఖ్యలో భక్తులు వచ్చారు. శ్రీనివాస శాస్త్రి శ్రీరాముల వారి పాదుకలు తయారు చేయించారు. వాటితో పాదయాత్రగా వెళ్తున్నారు. గతంలో శ్రీరామచంద్రుడు ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చారు. ప్రస్తుతం ఆయన పాదుకలు దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్తున్నాయి అంటూ స్వామీజీ అభివర్ణించారు. పాదుకలకు ప్రత్యేక పూజలు చేసారు. ఆయన స్వహస్తాల మీదుగా పూజలు చేసి శ్రీనివాస శాస్త్రికి అందజేశారు. అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది.





Total views : 62241