రష్యా పర్యటన ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో నుంచి మంగళవారం రాత్రి ఆస్ట్రియా రాజధాని వియన్నా చేరుకున్నారు. తద్వారా 1983లో ఇందిరా గాంధీ పర్యటించిన 41 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాలో పర్యటించిన రెండో ప్రధానిగా నిలిచారు. ఎయిర్ పోర్టులో మోదీకి ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ స్కాల్లెన్ బర్గ్ తోపాటు ఆస్ట్రియాలో భారత రాయబారి శంభు కుమరన్ ఘన స్వాగతం పలికారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, భౌగోళిక, రాజకీయ సవాళ్లపై మరింత మెరుగైన సహకారం దిశగా ఆస్ట్రియాతో మోదీ చర్చలు జరపనున్నారు. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డర్ బెల్లెన్ తోపాటు ఆ దేశ చాన్స్ లర్ కార్ల్ నెహమ్మెర్ తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. అలాగే ఇరు దేశాలకు చెందిన వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- విశ్వశాంతి కోసం మోడీ ప్రయత్నం…హైదరాబాద్‌లోని హైటెక్ సిటి శిల్పకళా వేదికలో లోక్‌మంథన్-2024 కార్యక్రమం ముగింపు వేడుకలు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు జరిగిన లోక్ మంథన్‌లో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్,…
- IPL చరిత్రలోనే అత్యధిక ధర పలికిన పంత్..దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో భారత స్టార్ ప్లేయర్లు చరిత్రను తిరగ రాస్తున్నారు. వేలం స్టార్టింగ్ లోనే బౌలర్ అర్షదీప్ సింగ్‌ను పంజాబ్ జట్టు 18 కోట్లకు ఆర్టీఎమ్ చేసుకొగా.. అనంతరం స్టార్ బ్యాటర్ శ్రేయస్…
- రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి..సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానంతో సమావేశం అయ్యేందుకు హస్తినకు బయలుదేరనున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఉత్సవాలకు హాజరుకావాలని…
- సెంచరీతో కొత్త రికార్డును సృష్టించిన విరాట్ కోహ్లీబోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కొత్త రికార్డును సృష్టించాడు. సాలిడ్ డిఫెన్స్ తో పాటు అవసరమైన సమయంలో బ్యాట్ ను మంత్రడండంలా తిప్పుతూ మ్యాజికల్ షాట్స్ ఆడుతున్నాడు. హాఫ్ సెంచరీ దాటేసి…
- నాకు కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయివికసిత్ భారత్ లో యువత పాత్ర కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎన్సీసీ పేరు వినగానే మనకు స్కూల్-కాలేజీ రోజులు గుర్తుకొస్తాయని, తాను ఎస్సీసీ విద్యార్థిని అని తెలిపారు. ఆ సమయంలో తాను పొందిన అనుభవం అమూల్యమైనదని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి