రష్యా పర్యటన ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో నుంచి మంగళవారం రాత్రి ఆస్ట్రియా రాజధాని వియన్నా చేరుకున్నారు. తద్వారా 1983లో ఇందిరా గాంధీ పర్యటించిన 41 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాలో పర్యటించిన రెండో ప్రధానిగా నిలిచారు. ఎయిర్ పోర్టులో మోదీకి ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ స్కాల్లెన్ బర్గ్ తోపాటు ఆస్ట్రియాలో భారత రాయబారి శంభు కుమరన్ ఘన స్వాగతం పలికారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, భౌగోళిక, రాజకీయ సవాళ్లపై మరింత మెరుగైన సహకారం దిశగా ఆస్ట్రియాతో మోదీ చర్చలు జరపనున్నారు. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డర్ బెల్లెన్ తోపాటు ఆ దేశ చాన్స్ లర్ కార్ల్ నెహమ్మెర్ తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. అలాగే ఇరు దేశాలకు చెందిన వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
- ప్యారడైజ్ నా కెరీర్లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.ప్యారడైజ్ నా కెరీర్లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా. సెప్టెంబర్ 24న వస్తున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సినిమా అంతా హైలెట్‌గా ఉంటుంది: ప్రెస్ మీట్లో న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్ స్టార్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి