అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపిన ఇంటూరి…

Inturi supported the Anganwadi strike

Advertisements

&NewLine;<p>జీతాలు పెంచాలని&comma; ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉలవపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని&comma; ఉలవపాడులో అంగన్వాడీల సమ్మె కొనసాగుతూనే ఉంది&period; కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం శిబిరానికి వెళ్లి మద్దతు తెలిపారు&period; ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి&comma; ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లోనూ&period;&period; చంద్రబాబు నాయుడు అంగన్వాడీలకు రెండుసార్లు జీతాలు పెంచారని గుర్తు చేశారు&period; కానీ అనేక ఆశలు చూపి&comma; వారి చేత ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక లక్షలాది అక్క చెల్లెమ్మలను మోసం చేశారని విమర్శించారు&period; తెలంగాణలో కంటే అదనంగా జీతాలు పెంచుతానని జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడమ తిప్పారని నాగేశ్వరావు అన్నారు&period; ఒకసారి మాత్రమే వెయ్యి రూపాయలు పెంచి&comma; వారికి సంక్షేమ పథకాల అమలులో కోత విధించారని మండిపడ్డారు&period; ఉద్యోగులకు తమ సమస్యలు చెప్పుకునే హక్కు ఉంటుందని&comma; కానీ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల సమ్మెపై ఉక్కుపాదం మోపి రకరకాలుగా బెదిరించడం దుర్మార్గమని నాగేశ్వరరావు అన్నారు&period; రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో అంగన్వాడీలకు సంబంధించిన అన్ని సమస్యలను చంద్రబాబు నాయుడు గారు పరిష్కరిస్తారని నాగేశ్వరరావు తెలిపారు&period; ఎలాంటి షరతులు విధించకుండానే&comma; మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రతి మహిళ కుటుంబానికి అందజేస్తారని వివరించారు&period; సిఐటియు ఆధ్వర్యంలో కార్యక్రమం జరగగా&comma; మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు&comma; గ్రామ పార్టీ అధ్యక్షుడు అంచుపోగు వాసు&comma; ఎంపీటీసీ దార్ల యలమందమ్మ&comma; క్లస్టర్ ఇంచార్జ్ లు బెల్లం కృష్ణమోహన్&comma; పోలుబోయిన శ్రీనివాసులు&comma; సుదర్శి శ్రీనివాసులు&comma; పార్టీ నాయకులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.