ఇజ్రాయెల్‍పై ఇరాన్ క్షిపణి దాడులు …

Advertisements

<p>పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌–అమెరికా&comma; ఇరాన్‌ నడుమ యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది&period; కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్‌ దాడులకు దిగింది&period; అక్కడి ఇంధన నిల్వ ట్యాంకులనే లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు ప్రయోగించింది&period; ఒక ట్యాంక్‌ పేలిపోయి విమానాశ్రయంలో భారీగా మంటలు చెలరేగినట్టు కువైట్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది&period; ఖతర్‌ తీర సమీపంలో ఆ దేశానికి చెందిన ఓ చమురు నౌకపై కూడా ఇరాన్‌ క్రూయిజ్‌ క్షిపణితో దాడి చేసింది&period; దాంతో అందులోని 21 మంది సిబ్బందిని హుటాహుటిన ఖాళీ చేయించారు&period; యూఏఈలోని ఫుజైరాలో డ్రోన్‌ శకలాలు తాకి ఒక వ్యక్తి మరణించాడు&period; బహ్రెయిన్‌పై కూడా ఇరాన్‌ క్షిపణులు&comma; డ్రోన్లతో దాడులకు దిగింది&period; పలు క్షిపణులు&comma; డ్రోన్లను నేలకూల్చినట్టు జోర్డాన్&comma; సౌదీ అరేబియా ప్రకటించాయి&period; యూఏఈలోని ఉమ్‌ అల్‌ థౌబ్‌ పారిశ్రామిక ప్రాంతంపై ఇరాన్‌ జరిపిన డ్రోన్‌ దాడిలో ఒక భారతీయుడు గాయపడ్డాడు&period; బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి మరణించాడు&period; తన ప్రధాన శత్రువైన ఇజ్రాయెల్‌పై కూడా ఇరాన్‌ భారీ స్థాయిలో విరుచుకుపడింది&period; దేశవ్యాప్తంగా పలు నగరాలపై క్షిపణులు&comma; డ్రోన్ల వర్షం కురిపించింది&period; దాంతో ఎక్కడ చూసినా సైరన్ల మోత విన్పించింది&period; ఐదుగురికి పైగా గాయపడ్డట్టు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.