ఏపీ కాంగ్రెస్ పార్టీకి లాభమా? నష్టమా?

Sharmila joins AP Congress

Advertisements

&NewLine;<p>ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖాయమయ్యింది&period; బుధవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన షర్మిల సోనియా&comma; రాహుల్&comma; ప్రియాంకల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు&period; ఈ క్రమంలో రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల పాత్ర ఎంత ఉండబోతోంది అనే దాని మీద ఆసక్తి నెలకొంది&period; నిజానికి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా&quest; లేదా&quest; అన్నట్లుగానే ఉంది&period; షర్మిల చేరికతో ఏపీ కాంగ్రెస్ కు కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది&period; ఉనికి చాటుకునే అవకాశం ఉంది&period; తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో కీలకంగా వ్యవహరించిన పార్టీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాకూర్ ను ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ గా నియమించారు&period; దీన్ని బట్టే కాంగ్రెస్ ఏపీ ఎన్నికలను ఎలా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ అధికారంలోకి రావడం అనేది జరిగే అవకాశం లేదు&period; అటు వైసీపీ మరోవైపు టీడీపీ-జనసేన ఉమ్మడి పోటీని తట్టుకుని కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు&period; కానీ కొన్నిచోట్ల తీవ్ర ప్రభావం చూపనుంది&period; ముఖ్యంగా కృష్ణ&comma; గుంటూరు జిల్లాలపై షర్మిలా ప్రభావం ఉండనుంది&period; ఆ జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే షర్మిలతో టచ్ లో ఉన్నారు&period; వైసీపీలో మార్పుల పర్వంతో డైలమాలో పడ్డ చాలామంది నేతలు షర్మిల వైపు చూస్తున్నారు&period; ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే బాహాటంగానే షర్మిలతో కలిసి నడుస్తానని ప్రకటించారు&period; తాజాగా మరో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గతంలో వైఎస్ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్న నేత మల్లాది విష్ణు&period; కాంగ్రెస్ లో ఉన్న ఆయన వైసిపి స్థాపించడంతో వైసీపీలో జాయిన్ అయ్యారు&period; 2014లో వైసీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు&period; 2019లో మరోసారి పోటీ చేసి&period;&period; 100 ఓట్ల తక్కువ మెజారిటీతో గెలిచారు&period; ఈ క్రమంలోనే ఈ సారి ఆయనకు సీటు నిరాకరిస్తోంది వైసీపీ అధిష్టానం&period; మరోసారి గెలిచే అవకాశం లేదనే ఆలోచనతోనే తనను పక్కన పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; దీంతోనే ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అవ్వాలని భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రస్తుత ఎమ్మెల్సీ&comma; మాజీ మంత్రి డొక్కా మాణిక్యం కూడా కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు&period; ఆయన కాంగ్రెస్ హయాంలో రెండుసార్లు మంత్రి పదవి చేశారు&period; కాంగ్రెస్ నుంచి టిడిపిలో జాయిన్ అయి ఎమ్మెల్సీ అయ్యారు&period; తరువాత మూడు రాజధానుల ప్రకటనతో వైసీపీలో జాయిన్ అయ్యారు&period; ఎమ్మెల్సీ అయ్యారు&period; డొక్కా కూడా తనకు కనీసం అధినేత జగన్ ను కలవటానికి కూడా అవకాశం లభించడం లేదంటూ బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచన చేస్తున్నారు&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా ఇలాంటి అసంతృప్తితో ఉన్నారు&period; మోపిదేవి వెంకటరమణ కూడా వైయస్ కుటుంబానికి చాలా దగ్గరి వారు&period; జగన్ మొదటి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు&period; శాసనమండలి రద్దు క్రమంలో మంత్రి పదవి వదులుకొని ఎంపీగా వెళ్లారు&period; ఇప్పుడు ఆయనను రేపల్లె ఇన్చార్జి నుంచి కూడా తప్పించారు&period; దీంతో అసంతృప్తితో ఉన్న మోపిదేవి కాంగ్రెస్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని వినిపిస్తోంది&period; మరో నేత కొలుసు పార్థసారథి కూడా వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్ననేత&period; కాంగ్రెస్లో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది&period; ఇటీవల జగన్ తనను పట్టించుకోవడం లేదని&period;&period; జగన్ పట్టించుకోకపోయినా&period;&period; ప్రజలు పట్టించుకుంటున్నారని బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు&period; ఇప్పుడు కొలుసు పార్థ సారథి కూడా కాంగ్రెస్ వైపు&comma; షర్మిల చేరికవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇలా రెండు జిల్లాలలో పాత కాంగ్రెస్ లీడర్లు&comma; వైసీపీ నుంచి సీటు ఆశించి భంగపడ్డ లీడర్లు కాంగ్రెస్కు వెళ్లే ఆలోచనలో ఉన్నారు&period; మరి షర్మిల కాంగ్రెస్ లో చేరితే&period;&period; ఏపీ రాజకీయాల్లో చురుకుగా ఉంటారా&quest; ఆమెకు ఏపీసీసీ పదవి ఇస్తారా&quest; లేక ఏదైనా జాతీయ పదవి ఇస్తారా&quest; షర్మిల భవిష్యత్ రూట్ మ్యాప్ ఏంటి&quest; వైసీపీకి దెబ్బపడుతుందా&quest; టీడీపీ-జనసేన కూటమి ఓట్లు చీలతాయా&quest; ఇనే ప్రశ్నలకు సమాధానం మరికొద్ది రోజుల్లో తేలనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్