ఫోన్‌లో ఇంటర్నెట్ ‘స్లో’గా ఉందా.. ఈ ట్రిక్స్ ట్రై చెయ్యండి!

Internet 'slow' on phone

Advertisements

&NewLine;<p>ఈ రోజుల్లో స్టార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు దాదాపు అన్ని పనులు అయిపోతున్నాయి&period; అయితే దీనంతటికి ఫోన్ లో ఇంటర్నెట్ వేగంగా పనిచేయడం చాలా ముఖ్యం&period; ఫోన్ యొక్క ఇంటర్నెట్ వేగాన్నికి ఈ ట్రిక్స్ ట్రై చెయ్యండి&period; వీటి ద్వారా మీ ఫోన్ లో ఎప్పుడైనా ఇంటర్నెట్ స్పీడ్ తగ్గితే మీరు ఈజీగా దానిని పరిష్కరించవచ్చు&period; ఫోన్‌లో ఇంటర్నెట్ వేగాన్ని పెంచడానికి సులభమైన మార్గం ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం&period; ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం ద్వారా అన్ని ప్రోగ్రామ్‌లు రిఫ్రెష్ అవుతాయి&period; నెట్‌వర్క్ కనెక్షన్‌లో చిన్న సమస్యలు పరిష్కరించబడతాయి&period; ఇంటర్నెట్ వేగం పెరుగుతుంది&period; యాప్ అప్‌డేట్‌à°² కారణంగా ఇంటర్నెట్ వేగం బాగా ప్రభావితమవుతుంది&period; ఎందుకంటే&comma; యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతూ ఉంటాయి&period; అటువంటి పరిస్థితిలో వాటిని అప్‌డేట్ చేయడంలో చాలా స్పీడ్ వృధా అవుతుంది&period; దీంతో మీ ప్రస్తుత పనిలో మీకు తక్కువ వేగం అనిపిస్తుంది&period; మీరు ఆతురుతలో ఉంటే&comma; ఫోన్‌ను రీస్టార్ట్ చేయడానికి సమయం లేకపోతే ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆఫ్ చేసి కొన్ని సెకన్ల పాటు అలాగే ఉంచి మళ్లీ ఆన్ చేయండి&period; ఇది మీ నెట్‌వర్క్ కనెక్షన్‌ని రీసెట్ చేస్తుంది&period; మీ సమస్య కూడా పరిష్కరించబడే అవకాశం ఉంది&period; ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి&period; ఆ సమస్యల్లో ఒకటి ఇంటర్నెట్ వేగం&period; ఎందుకంటే ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లలో అనేక రకాల బెటర్మెంట్స్ రిలీజ్ అవుతాయి&period; కాబట్టి&comma; మీ ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయబడిందో లేదో చెక్ చేయండి&period; పైన తెలిపిన పద్ధతుల ద్వారా మీ సమస్య పరిష్కరించబడకపోతే నెట్‌వర్క్ సెట్టింగ్‌లను ఒకసారి రీసెట్ చేయండి&period; అయితే&comma; అలా చేయడం వలన మీ సేవ్ చేయబడిన WiFi పాస్‌వర్డ్‌లు&comma; జత చేసిన బ్లూటూత్ పరికరాలు తొలగించబడతాయని గుర్తుంచుకోండి&period; పైన తెలిపిన పద్ధతులు మీ ఫోన్‌లో ఇంటర్నెట్ వేగాన్ని పెంచుతాయి&period; అయితే&comma; దీని తర్వాత కూడా మీ సమస్య పరిష్కారం కాకపోతే&comma; మీరు నిపుణుల నుండి సహాయం తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.