భారత్ టెక్ దిగ్గజం టీసీఎస్ జాక్ పాట్ కొట్టింది. ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ అవివా ఇప్పటికే టీసీఎస్‌తో కుదర్చుకున్న ఒప్పందాన్ని మరో 15ఏళ్ల పొడిగింది. 15 ఏళ్ల పాటు బీమా చట్టాల నిర్వాహణ, కస్టమర్ ఎక్స్పీరియన్స్ వంటి కార్యకాలాపాలు నిర్వహించేలా టీసీఎస్‌కు అప్పగించిన ప్రాజెక్ట్‌ను పొడిగిస్తున్నట్లు అవివా అధికారిక ప్రకటన చేసింది. అయితే ఇరు కంపెనీల మధ్య ఒప్పందం అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉండగా పలు నివేదికల ప్రకారం ఈ డీల్ విలువ 500 మిలియన్ల కంటే ఎక్కువ మొత్తంలో ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. యూకేలో అవివా సంస్థ గత 20 ఏళ్లుగా టీసీఎస్‌తో కలిసి పనిచేస్తుంది. ఇక ఈ కొత్త ఒప్పందంలో భారత్ కంపెనీ అవివా ఎండ్ టు ఎండ్ పాలసీ అడ్మినిస్ట్రేషన్, 5.5 మిలియన్లకు పైగా పాలసీలను సేవల్ని నిర్వహిస్తుంది.
టెక్ దిగ్గజం టీసీఎస్‌కు జాక్ పాట్
99
previous post