మనసున్న మహామనిషి, మనందరి అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చిరకాలం వర్ధిల్లాలని జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఆకాంక్షించారు. నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ లో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. సారవకొట మండలంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ ప్రారంభించారు. ఈ వేడుకల్లో జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ముందుగా సీఎం వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మానవత్వం ఉన్న నేతగా జగన్ ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరి మన్ననలు అందుకుంటున్నారని అన్నారు. టీడీపీకి ఓటు వేసినా సరే పేదరికమే కొలమానంగా భావించి రాజకీయాలకు అతీతంగా సంక్షేమపథకాలు అమలుచేస్తున్నారని అన్నారు. పేదల పెన్నిధిగా, రాష్ట్రాభివృద్ధికి అంకితమైన నేతగా సీఎం జగన్ 50 సంవత్సరాలు పూర్తిచేసుకుని 51వ ఏట అడుగుపెట్టారని, ఆయన సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వరాలతో చిరకాలం వర్ధిల్లాలని అన్నారు. ఈ రాష్ట్రానికి జగనే మళ్లీ సీఎం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా జగన్మోహనరెడ్డి పుట్టినరోజు వేడుకలు..
111
previous post