రైతుల పాలిట జగన్ పాలన శాపంగా మారిందని, నాలుగేళ్ల జగన్ పాలనలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని పచ్చలతాటిపర్రు, మునిపల్లె, గొళ్ళముడిపాడు, వెల్లలూరు తదితర గ్రామాలలో తుఫాను నేపథ్యంలో నీట మునిగిన పంట పొలాలను మంగళవారం ఆయన టిడిపి శ్రేణులు రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప రైతులకు మేలు చేసిందేమీ లేదన్నారు. గత సంవత్సరం తుఫాను సమయంలో దెబ్బతిన్న పంటలు కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. వారం రోజులుగా తుఫాన్ గురించి హెచ్చరికలు వస్తున్నప్పటికీ అధికారులను అప్రమత్తం చేయటంలో విఫలం అయ్యారని ఆరోపించారు. తుఫాను ప్రభావంతో పంట చేతికి వచ్చే సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం పెద్ద పనుస్సుతో వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రైతుల పాలిట శాపంగా మారిన జగన్ పాలన..
69