కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం,ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా నీటమునిగిన పంటపొలాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇంఛార్జి వరుపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో టిడిపి బృందం పరిశీలించారు. వరి, అరటి రైతులతో పంట నష్టాన్ని గురించి చర్చించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు చిక్కాల రామచంద్రరావు,బోళ్ల వెంకటరమణ,నియోజకవర్గ ఇంఛార్జి వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ మిచౌంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో అధికారులు అంచనా వేసిన పంటనష్టం కంటే ఎక్కువే ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హుద్ హుద్, తిత్లీ, హరికేన్ తుఫాన్ల సమయాల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పరిశీలించి వెంటనే న్యాయం చేసారని గుర్తు చేశారు. తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, అన్ని రకాల పంటలకు తగిన నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.
typhoon
రైతుల పాలిట జగన్ పాలన శాపంగా మారిందని, నాలుగేళ్ల జగన్ పాలనలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని పచ్చలతాటిపర్రు, మునిపల్లె, గొళ్ళముడిపాడు, వెల్లలూరు తదితర గ్రామాలలో తుఫాను నేపథ్యంలో నీట మునిగిన పంట పొలాలను మంగళవారం ఆయన టిడిపి శ్రేణులు రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప రైతులకు మేలు చేసిందేమీ లేదన్నారు. గత సంవత్సరం తుఫాను సమయంలో దెబ్బతిన్న పంటలు కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. వారం రోజులుగా తుఫాన్ గురించి హెచ్చరికలు వస్తున్నప్పటికీ అధికారులను అప్రమత్తం చేయటంలో విఫలం అయ్యారని ఆరోపించారు. తుఫాను ప్రభావంతో పంట చేతికి వచ్చే సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం పెద్ద పనుస్సుతో వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రష్యా ఆక్రమిత ప్రాంతం క్రిమియాపై తుఫాన్ విరుచుకుపడింది. నల్ల సముద్రంలో ఏర్పడిన పెను తుపాను క్రిమియాను అతలాకుతలం చేసింది. 20 లక్షల మందిపై తుఫాన్ ప్రభావం పడింది. నలుగురు మృతి చెందగా, భారీగా ఆస్తినష్టం సంభవించింది. రష్యా దక్షిణ భాగంలోని సోచీలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. తుఫాన్ కారణంగా గంటకు 144 కి.మీ వేగంతో ప్రచండ గాలులు వీయడంతో విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతింది. దాంతో చాలా ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. గత 16 ఏళ్లలో ఇంతటి తీవ్రమైన తుపాను ఎప్పుడూ రాలేదని అధికార వర్గాలు అంటున్నాయి. సెవస్తపోల్ లో ఉన్న అరుదైన జలచరాలతో కూడిన ఆక్వేరియం తుపాను ధాటికి ధ్వంసమైంది. దాంతో, ఎన్నో అరుదైన చేపలు మృత్యువాతపడ్డాయి. అటు, ఉక్రెయిన్ కూడా ఈ తుపాను ప్రభావానికి గురైంది. విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో ఉక్రెయిన్ లో 2 వేల పట్టణాలు అంధకారంలో చిక్కుకున్నాయి.




Total views : 78818