అభ్యర్థుల ఎంపిక పై జనసేన(Janasena) స్పష్టి..
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తున్న జనసేన ఇప్పటి వరకు ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, మరో 11 స్థానాలపై స్పష్టతనిచ్చింది. ఎంపిక చేసిన అభ్యర్థులను పిలిపించి ప్రచారం చేసుకోవాలని చెప్పినట్టు తెలిసింది. ప్రకటించాల్సిన మూడు స్థానాల్లో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు ఉన్నాయి. టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా దక్కిన అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి గిడ్డి సత్యనారాయణ(Giddi Satyanarayana)ను ఖరారు చేసింది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి ఆయనను పిలిపించిన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రచారం చేసుకోవాలని సూచించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
తిరుపతి అసెంబ్లీ స్థానంలో విషయంలో చిక్కుముడి వీడడం లేదు. జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఆయన స్థానికేతరుడు కావడంతో బీజేపీ, టీడీపీ నుంచి ఆయనకు సహకారం అందడం లేదు. ఆ స్థానాన్ని హరిప్రసాద్, కిరణ్ రాయల్, టీడీపీ నుంచి మరో ఇద్దరు నాయకులు జనసేన నుంచి టికెట్ ఆశిస్తున్నారు. సీటు ఇస్తే కనుక పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మచిలీపట్టణం ఎంపీ స్థానం బాలశౌరికి దాదాపు ఖరారైనట్టు తెలిసింది. అయితే, ఆయనను అవనిగడ్డ నుంచి బరిలోకి దింపే యోచనలో పార్టీ ఉన్నట్టు తెలిసింది.
ఇది చదవండి: భీమ్ కు కన్నీటి వీడ్కోలు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి