66
జనసేన పార్టీకి యువతే పెద్ద బలం అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీలో జనసేనకు ఆరున్నర లక్షల క్యాడర్ ఉందన్నారు. మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడారు. యువత ఆదరణ చూసే తెలంగాణలో 8 చోట్ల పోటీ చేశామన్నారు. నేనేం చేసినా దేశ సమగ్రత గురించే ఆలోచిస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తల చిత్తశుద్ధి వల్లే జనసేనకు ఢిల్లీలోనూ గుర్తింపు వచ్చిందని తెలిపారు. నన్ను, నా భావజాలాన్ని నమ్మే యువత జనసేన వెంట వస్తున్నారని చెప్పారు. భావజాలం ఏమీ లేని పార్టీ వైసీపీ అని పవన్ ఎద్దేవా చేశారు.