జనసేన దారుణ ఓటమి….

janasena

Advertisements

&NewLine;<p>తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన దారుణ ఓటమి పాలైంది&period; బీజేపీతో కలిసి బరిలోకి దిగిన జనసేన తొలుత 11 స్థానాల్లో పోటీ చేయాలని భావించింది&period; చివరికి 8 స్థానాలకు పరిమితమై కూకట్‌పల్లి&comma; తాండూరు&comma; కోదాడ&comma; నాగర్‌కర్నూలు&comma; ఖమ్మం&comma; కొత్తగూడెం&comma; వైరా &comma; అశ్వారావుపేట స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది&period; వీరికోసం పార్టీ అధ్యక్షుడు పవన్ ప్రచారం చేశారు&period; బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూకట్‌పల్లిలో ప్రచారం చేశారు&period; అయినప్పటికీ అందరూ ఓటమి పాలయ్యారు&period; అంతేకాదు&comma; ఏ ఒక్కరూ డిపాజిట్ దక్కించుకోలేకపోయారు&period; కూకట్‌పల్లి నుంచి పోటీచేసిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ ఒక్కరే 39&comma;830 ఓట్లు సంపాదించుకోగలిగారు&period; మిగతా వారందరూ 5 వేల లోపు ఓట్లకు పరిమితమయ్యారు&period; తాండూరులో జనసేన అభ్యర్థికి 4&comma;087 ఓట్లు పోలవగా&comma; కోదాడలో 2&comma;151&comma; నాగర్‌కర్నూలులో 1&comma;955&comma; ఖమ్మం 3&comma;053&comma; వైరా 2&comma;712&comma; వైరా 2&comma;712&comma; కొత్తగూడెం1&comma;945&comma; అశ్వారావుపేట అభ్యర్థికి 2&comma;281 ఓట్లు పోలయ్యాయి&period; ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన సీపీఎం పోటీ చేసిన 19 స్థానాల్లోనూ డిపాజిట్ కోల్పోయింది&period; అంతేకాదు&comma; ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం&comma; మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి వంటి కీలక నేతలు కూడా డిపాజిట్ కోల్పోయారు&period; సీపీఎం తొలుత కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినా పొత్తు చర్చలు ఫలించకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగి ఓటమి పాలైంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.