జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట…

Supreme Court...

Advertisements

&NewLine;<p>సినీనటి&comma; మాజీ ఎంపీ జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది&period; ఆమెకు చెన్నై ఎగ్మోర్ లోని ట్రయల్ కోర్టు విధించిన 6 నెలల జైలు శిక్షపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది&period; చెన్నైలో జయప్రద ఒక సినిమా థియేటర్ ను నిర్వహించారు&period; థియేటర్ కు నష్టాలు రావడంతో దాన్ని మూసివేశారు&period; అయితే&comma; తమకు ఈఎస్ఐ డబ్బులు ఇవ్వలేదంటూ థియేటర్ కార్మికులు ఎగ్మోర్ కోర్టులో కేసు వేశారు&period; ఈ కేసులో జయప్రదకు ట్రయల్ కోర్టు శిక్షను విధించింది&period; దీంతో&comma; ట్రయల్ కోర్టు తీర్పును జయప్రద మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశారు&period; అయితే&comma; ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది&period; దీంతో&comma; హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు&period; జయప్రద పిటిషన్ పై తదుపరి విచారణ ముగిసేంత వరకు శిక్షపై స్టే విధిస్తున్నట్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.

280 ఎకరాల వెంచర్‌ వ్యవహారంలో వివాదాలు.

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.