280 ఎకరాల వెంచర్‌ వ్యవహారంలో వివాదాలు.

Advertisements

<p>ప్రముఖ రియల్టర్‌&comma; హోమ్‌ల్యాండ్ అధినేత బాణాల రాంరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు&period; రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులోని తన ఫాంహౌస్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు&period; పటాన్‌చెరులో 280 ఎకరాల్లో వెంచర్‌ అభివృద్ధి చేస్తున్న రాంరెడ్డి&period;&period; స్థానిక నేతలు&comma; పలువురి ఒత్తిళ్లతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం&period; ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;<p>2018లో పటాన్‌చెరువు ప్రాంతంలో సుమారు 280 ఎకరాల భూమిని డెవలప్‌మెంట్ కోసం తీసుకుని వెంచర్‌ చేపట్టారు&period; అయితే భూమికి సంబంధించిన వివాదాలు&comma; కోర్టు లిటిగేషన్ల కారణంగా వెంచర్‌ అభివృద్ధి ఆలస్యమైనట్లు తెలుస్తోంది&period; వివాదాల పరిష్కారం కోసం భారీగా అప్పులు చేయడంతో పాటు&period;&period; భూ యజమానులతోనూ సమస్యలు తలెత్తినట్లు సమాచారం&period; వెంచర్‌ ఆలస్యం కావడంతో ఆర్థిక భారం పెరిగి తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>రాంరెడ్డి రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్‌ నోట్‌ను కందుకూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period; దాని ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period; సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది&period; మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు&period; రాంరెడ్డి ఆత్మహత్యకు అసలు కారణాలు&comma; ఆయనపై ఎవరైనా ఒత్తిడి తెచ్చారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.