132
మాచర్ల నియోజకవర్గం లో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను పరిశీలించేందుకు తెలుగుదేశం జనసేన లకు చెందిన నిజ నిర్ధారణ కమిటీ ఆదివారం మాచర్లలో పర్యటించుచున్నారు. నిజ నిర్ధారణ కమిటీ పర్యటన నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని వెల్దుర్తిలోని ఆయన నివాసంలో పోలీసులు నిర్బంధించారు. బ్రహ్మారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయటాన్ని తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీ అక్రమాలను బయటపెడుతుంటే ప్రతిపక్షాలను నిర్బంధించటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పలువురు విమర్శిస్తున్నారు.