76
సోమవారం తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల వలన ఉప్పాడ తీరంలో రోడ్లను పరిశీలించారు. ఈ సంద్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాను ప్రభావం వలన భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దని , గ్రామాల్లోని ప్రజలు అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కలెక్టర్ సూచించారు. పునరావాస కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రజలు వాటికి తరలి వెళ్లాలని కలెక్టర్ కోరారు. ఉప్పడ ప్రాంతంలో రోడ్లు సక్రమంగానే ఉన్నాయని సముద్రం అలల వలన ఎటువంటి నష్టం వాటిల్ల లేదని కలెక్టర్ అన్నారు. జిల్లా కలెక్టర్ వెంట యూ కొత్తపల్లి తాసిల్దార్ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.