మద్యం కుంభకోణంలో నిందితురాలిగా ఉన్న కవితను ఏడు రోజుల కస్టడీకి తీసుకున్న ఈడీ.. దర్యాప్తులో భాగంగా తొలిరోజు ఆమెను సుదీర్ఘంగా విచారించింది. ఆదివారం ఉదయం పది గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భాను ప్రియ మీనా నేతృత్వంలో అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మద్యం కుంభకోణానికి సంబంధించి స్పష్టత రావాల్సిన అంశాలపై ఆమె నుంచి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాలపై కవితను వివరణ కోరినట్లు సమాచారం. అలాగే.. ముడుపులు ఎలా చేతులు మారాయన్న అంశంతో పాటు ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో ఆమె పాత్రపై ఈడీ ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. కవిత వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డు చేశారు. కాగా ఈడీ కార్యాలయంలో కవితను నేడు రెండో రోజు అధికారులు విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు కవితను విచారించనున్నారు. నిన్న కవిత విచారణను ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ తర్వాత కవితను కేటీఆర్, హరీష్, భర్త అనిల్, లాయర్ మోహిత్ రావు తదితరులు కలిశారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టు చేయడాన్ని కవిత భర్త అనిల్ సవాల్ చేస్తూ నేడు సుప్రీం కోర్టులో పిటేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే అనిల్ వేసిన కంటెంప్ట్ పిటేషన్‌పై ఈ రోజు విచారణ జరగనుంది.
కవితను కస్టడీలోకి తీసుకున్న ఈడీ…
96
previous post