90
ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడమే బిజెపి పని అని, బిజెపి అధికారంలోకి వస్తే నిత్యవసరాల ధరలు పెరుగుతాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి కవిత మాట్లాడుతూ నాడు అరిగోస పడ్డ తెలంగాణ నేడు బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందన్నారు. షుగర్ ఫ్యాక్టరీలను ముంచిందే బిజెపి అని, నేడు అదే బీజేపీ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామనడం విడ్డూరంగా ఉందని అన్నారు. అభివృద్ధి చేసే బిఆర్ఎస్ వైపు ఉండాలని, అరాచకం చేసే కాంగ్రెస్, బిజెపి వద్దని ఆమె అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి కల్వకుంట్ల సంజయ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు.