64
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు కేదారి గౌరీ వ్రతాన్ని ఆచరించిన ఆలయ వేద పండితులు ప్రతి సంవత్సరము దీపావళి మరుసటి రోజు వచ్చే కేదారి గౌరీవ్రతాన్ని శ్రీకాళహస్తీశ్వరాలయంలో పెద్ద ఎత్తున వ్రతము ఆచరించుకునే భక్తుల కోసం ఈ సంవత్సరం కూడా ఆలయ అధికారులు 500 రూపాయల రాహు కేతు మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వ్రతాన్ని ఆచరించడానికి శ్రీకాళహస్తిలోని ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వచ్చి వ్రతాన్ని ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవో సాగర్ బాబు దంపతుల తో పాటు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు కుటుంబ సభ్యులు బోర్డు సభ్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు