కేరళ కొట్టాయంలో ఏనుగు బీభత్సం..

కేరళ కొట్టాయంలో ఏనుగు బీభత్సం

Advertisements

<p>కేరళలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది&period; కొట్టాయం జిల్లాలోని కిడంగూర్ మహావిష్ణు ఆలయంలో వార్షిక ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతుండగా&comma; ఒక్కసారిగా ఊహించని విషాదం చోటుచేసుకుంది&period; వేడుకల్లో భాగంగా అలంకరించిన ఒక ఏనుగు అకస్మాత్తుగా అదుపు తప్పి బీభత్సం సృష్టించింది&period; చుట్టుపక్కల భక్తులు భయంతో పరుగులు తీస్తుండగా&comma; ఆ గజరాజు తన కోపాన్ని వాహనాలపై చూపించింది&period;<&sol;p>&NewLine;<p>అక్కడ పార్క్ చేసి ఉన్న ఒక కారును&comma; బైకును తన తొండంతో ఎత్తి పక్కకు విసిరేసింది&period; చూస్తుండగానే క్షణాల్లో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారిపోయింది&period; ఈ తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి చెందగా&period;&period;మరొకరు తీవ్రంగా గాయపడ్డారు&period; గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు&period; సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు&comma; రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుని గంటల పాటు శ్రమించి ఏనుగును మచ్చిక చేసుకుని బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ ఘటన మరోసారి కేరళలో ఏనుగుల వినియోగంపై పెద్ద చర్చకు దారితీసింది&period; &OpenCurlyQuote;దేవుడి ఉత్సవాల పేరుతో మూగజీవాలను హింసించడం సరికాదని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; భారీ శబ్దాలు&comma; రద్దీగా ఉండే జనాల మధ్య ఏనుగులు ఒత్తిడికి లోనవుతాయని&comma; అందుకే అవి ఇలా ప్రవర్తిస్తాయని వారు వాదిస్తున్నారు&period; కనీసం ఇప్పటికైనా ఇలాంటి వేడుకల్లో ఏనుగులను వాడటం మానేసి&comma; వాటిని అడవుల్లో స్వేచ్ఛగా వదిలేయాలని డిమాండ్ చేస్తున్నారు&period; కేవలం సంప్రదాయం కోసం ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంతవరకు సమంజసం అని సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..