అంగన్వాడీ విధానంలో కీలక మార్పులు..

anganwadi

Advertisements

&NewLine;<p>4ఏళ్ల నుండి పెండింగులో పెట్టిన అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్డిఓ ఆఫీస్ పక్కన కాకినాడ అర్బన్&comma; రూరల్ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్షను సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషాబాబ్జి ప్రారంభించారు&period; ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ&comma; తెలంగాణ కంటే అదనంగా అంగన్వాడీలకు వేతనం చెల్లిస్తానన్న జగన్మోహన్ రెడ్డి హామీ అమలు చేయాలని&comma; సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటీ ఇవ్వాలని&comma; రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు అంగన్వాడీలకు చెల్లించాలని&comma; 2017 నుండి బకాయి పెట్టిన టిఏ బిల్లులు చెల్లించాలని&comma; మినీ వర్కలను మెయిన్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు చెల్లించాలని కోరుతూ డిసెంబర్ 8వ తేదీ నుండి అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు&period; అనంతరం ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ &lpar;సిఐటియు అనుబంధం&rpar; రాష్ట్ర అధ్యక్షురాలు జి&period;బేబిరాణి మాట్లాడుతూ&comma; జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా వేలాది అంగన్వాడీ సెంటర్లను మెర్జ్ చేశారని&comma; నూతన విద్యా విధానం పేరుతో ఉన్న సెంటర్లను సైతం పాఠశాలల్లో విలీనం చేయడంవల్ల రాష్ట్రంలో బడుగు&comma; బలహీన వర్గాల ప్రజల పిల్లలకు పౌష్టికాహారం దూరమవుతుందని విమర్శించారు&period; బాలింతల ఇంటికి వెళ్లి ఫేస్ రికగ్నైజింగ్ చేసే యాపుల పని అంగన్వాడీలకు భారంగా మారిందన్నారు&period; సెంటర్లు వదిలేసి ఎఫ్&period;ఆర్&period;సి యాప్ పేరుతో ఇళ్ల చుట్టూ తిప్పుతూ&comma; అధికారులు&comma; రాజకీయ నాయకులు విజిట్ల పేరుతో సెంటర్ కి వచ్చే సమయంలో అంగన్వాడీ కనపడకపోతే మెమోలు ఇస్తూ అంగన్వాడీలను మానసిక వేదనకు&comma; రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారన్నారు&period; తక్షణం అన్ని యాప్లను కలిపి ఒకే యాప్ గా మార్చాలని డిమాండ్ చేశారు&period; ఆయాల ప్రమోషన్ వయస్సు 50సంవత్సరాలకు పెంచాలని&comma; ప్రమోషన్ల విషయంలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సైతం పక్కనపెట్టి నిబంధనలకు విరుద్డంగా కాకినాడ నగర ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది.

తిరుపతి జిల్లా పిచ్చాటూరు లో కూటమి ప్రభుత్వ విజయోత్సవం.

గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేస్తున్న ప్రభుత్వం.