73
తెలంగాణాలో రేపు ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. పినపాక, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ ,రాజేంద్ర నగర్ లలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అదేవిధంగా రేపు మధ్యాహ్నం టీ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో ను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నారు. ఆ తర్వాత కుత్బుల్లాపూర్ ఎన్నికల ప్రచారం లో ఖర్గే పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా సినీ నటి, బిజెపి నాయకురాలు విజయశాంతి ఖర్గే సమక్షంలో పార్టీలో చేరనుంది. విజయశాంతికి మెదక్ ఎంపీ స్థానం తో పాటు సముచిత గౌరవం ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.