కొమ్మూరు ప్రతాపరెడ్డి (Kommuru Prathap Reddy)
జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో డిసిసి అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాపరెడ్డి (Kommuru Prathap Reddy) పర్యటించారు. ధాన్యాన్ని పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ట్రేడర్స్ ధర తక్కువగా నిర్ణయించి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ట్రేడర్స్ రైతులకు కనీసం మద్దతు ధర ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయని, ఎవరైనా రైతులను మోసం చేస్తే సహించేది లేదని కొమ్మూరి ప్రతాపరెడ్డి హెచ్చరించారు. అటు ఎర్రగొల్లపాడు గ్రామానికి చెందిన రైతు బానోతు వెంకటేష్ మూడు రోజుల క్రితం మార్కెట్ యార్డ్ కు ధాన్యాన్ని తీసుకువచ్చాడు.
ఇది చదవండి : సింగిల్ విండో చైర్మన్ సస్పెండ్ విషయం లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ..
వరి కోసిన తర్వాత నాలుగు రోజులు ఆరబోసుకుని మార్కెట్ లోకి తీసుకువచ్చారు. అయితే తేమ శాతం పేరుతో అధికారులు ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని రైతు మండిపడ్డారు. ధాన్యానికి కనీస మద్ధతు ధర 2100 రూపాయలు ఉండగా, ఎవరూ కొనకపోవడంతో 1730 రూపాయలకే ధాన్యాన్ని విక్రయించానని రైతు తెలిపాడు. వర్షం వస్తే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని, అందుకే తక్కువ ధరకే విక్రయించానని రైతు చెబుతున్నాడు. అధికారులు స్పందించి మార్కెట్ లో కనీస సౌకర్యాలు కల్పించాలని రైతులు కోరుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News