కృష్ణా రివర్‌ బోర్డు సమావేశం

Krishna River Board

Advertisements

&NewLine;<p>హైదరాబాద్‌ జలసౌదాలో కృష్ణా రివర్‌ బోర్డు సమావేశం జరగనుంది&period; కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం&comma; నాగార్జునసాగర్‌లను బోర్డుకు అప్పగింతపై చర్చించనున్నారు&period; బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాల నుంచి కార్పస్‌ ఫండ్‌ నిధుల విడుదలపై చర్చించే అవకాశముంది&period; రెండు ఉమ్మడి ప్రాజెక్టులపై 15 కాంపోనెంట్లను బోర్డుకు అప్పగించాలని కేంద్ర జలశక్తి ఆదేశించింది&period; ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్‌ను ఏపీ&comma; నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది&period; అయితే ప్రాజెక్టులను బోర్డుకు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంటోంది&period; ముందు కృష్ణానదిలో వాటా తేల్చాలని టీ సర్కార్‌ పట్టుబడుతోంది&period; 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం తాత్కాలిక నీటి కేటాయింపులు చేసింది&period; తాత్కాలికంగా తెలంగాణకు 299&comma; ఏపీకి 512 టీఎంసీల నీటి కేటాయింపులు చేసింది&period; నీటి పరివాహక ప్రాంతాన్ని బట్టి కేటాయింపులు చేయాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది&period; నీటి కేటాయింపులు చేస్తేనే ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.