కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ఎవరకి?

MLA Ticket

Advertisements

&NewLine;<p>రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యే టికెట్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కుటుంబానికే కేటాయించాలని ఎస్వీ వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు&period; కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు అలాగే మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి సిఎంవో నుంచి పిలుపు రావడంతో అమరావతి వెళ్ళారు&period; అయితే ఈ సారి మళ్ళీ కర్నూలు ఎమ్మెల్యే టికెట్ హఫీజ్ ఖాన్‌కే ఇస్తారనే ప్రచారం జరుగుతుండటంతో కర్నూలు నగర శివార్లలో ఓ ప్రైవేట్ హోటల్లో మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వర్గీయులు సమావేశమయ్యారు&period; కర్నూలు ఎమ్మెల్యే టికెట్ తిరిగి హఫీజ్ ఖాన్‌కే కేటాయిస్తే సహకరించేది లేదని ఎస్వీ వర్గీయులు స్పష్టం చేశారు&period; ఈ సారి ఎమ్మెల్యే టికెట్ ఎస్వీ మోహన్ రెడ్డి కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు&period; గత 5సంవత్సరాల్లో స్వంత పార్టీలోనే అనేక ఇబ్బందులు పడి కేసులను ఎదుర్కొన్నామని&period;&period; ఇపుడు మరో సారి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ సారి కచ్చితంగా కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ఎస్వీ మోహన్ రెడ్డి కుటుంబానికే ఇవ్వాలని ఎస్వీ వర్గీయులు పట్టుబడుతున్నారు&period; కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు అలాగే మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి మధ్య కొద్ది కాలంగా విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి&period; దీంతో ఇపుడు కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ఎస్వీ మోహన్ రెడ్డి కుటుంబానికే కేటాయించాలని ఎస్వీ వర్గీయులు డిమాండ్ చేస్తుండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్