ప్రజా ప్రతినిధుల తొలగింపుపై త్వరలో జేపీసీ నివేదిక.

ప్రజా ప్రతినిధుల తొలగింపుపై త్వరలో జేపీసీ నివేదిక

Advertisements

<p>తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటూ అరెస్టై&comma; వరసగా 30 రోజులు నిర్బంధంలో ఉన్న ప్రజా ప్రతినిధులు ఆటోమేటిగ్గా పదవులు కోల్పోయేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చకు చేపట్టే అవకాశాలున్నాయి&period; ప్రధానమంత్రి&comma; ముఖ్యమంత్రులు&comma; కేంద్ర&comma; రాష్ట్ర మంత్రులందరికీ వర్తించే బిల్లును గత ఆగస్టులో పార్లమెంటులో ప్రవేశపెట్టారు&period; దానిపై సమగ్ర పరిశీలన నిమిత్తం అపరాజితా సారంగీ నేతృత్వంలో సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని నియమించారు&period;<&sol;p>&NewLine;<p>తమ అభ్యంతరాలను అధికారపక్షం సులభంగా బేఖాతరు చేస్తుందని పేర్కొంటూ కాంగ్రెస్‌ సహా విపక్ష ఇండియా కూటమి సభ్యులంతా జేపీసీని బహిష్కరించారు&period; కమిటీ ఈ నెల 17à°¨ భేటీ అయి నివేదికను ఆమోదించి&comma; 20 నుంచి మొదలయ్యే సమావేశాల్లో పార్లమెంటుకు సమర్పించే అవకాశం ఉంది&period; దానిపై సభలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు&period; పదవుల్ని కోల్పోయే ప్రధాన నిబంధనను కమిటీ అలాగే ఉంచి&comma; రాజకీయ ప్రతీకార చర్యల కోసం ప్రతిపాదిత చట్టం దుర్వినియోగం కాకుండా చూసేందుకు కొన్ని సూచనల్ని నివేదికలో చేర్చవచ్చని తెలుస్తోంది&period; బెయిల్‌ పొందడానికి 30 రోజుల గడువు సరిపోతుందని&comma; ఆ వ్యవధిలో కనీసం మూడుసార్లు ప్రయత్నాలు చేయవచ్చు కాబట్టి సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘించడం లేదని జేపీసీ గట్టిగా సమర్థిస్తోంది&period; నేర స్వభావం ఆధారంగా ఆంక్షలు ఉండాలనే సిఫార్సును జేపీసీ చేయవచ్చని భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.