పంట వ్యర్థాల దహనం వల్ల కలిగే శాస్త్రీయ, పర్యావరణ నష్టాలపై రైతులకు అవగాహన …

పంట వ్యర్థాల దహనం వల్ల కలిగే శాస్త్రీయ, పర్యావరణ నష్టాలపై రైతులకు అవగాహన

Advertisements

<p>రాష్ట్రంలో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భూసారం&comma; పర్యావరణం&comma; ప్రజారోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు&period; పంట వ్యర్థాల దహనాన్ని పూర్తిగా నివారించే దిశగా రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు&period; పంట వ్యర్థాలను కాల్చడం అనేది కేవలం రైతులకే సంబంధించిన విషయం కాదని&comma; ఇది సమాజం మొత్తం బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉందన్నారు&period; రైతులు&comma; వ్యవసాయ శాఖ అధికారులు&comma; ప్రజాప్రతినిధులు&comma; శాస్త్రవేత్తలు మరియు గ్రామస్థాయి స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి పంట అవశేషాలను కాల్చకుండా కలియదున్నే పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు&period; పంట వ్యర్థాలను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ కర్బన పదార్థం&comma; ఉపయోగకర సూక్ష్మజీవులు నశించి భూసారం క్షీణిస్తుందని&comma; తద్వారా పంటల దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని మంత్రి పేర్కొన్నారు&period; అదేవిధంగా గాలి కాలుష్యం పెరిగి శ్వాసకోశ&comma; కంటి&comma; చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు&period; ఇటీవల పంట వ్యర్థాలను కాల్చే సమయంలో సంభవించిన అగ్ని ప్రమాదాల్లో రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలను ప్రస్తావిస్తూ రైతులు అత్యంత జాగ్రత్తలు పాటించాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జూన్ 2న హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు ..

బాల్కసుమన్కు 14 రోజుల రిమాండ్..

అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..