ఏపీలో రైతుల ముంగిటకే మార్కెట్..

ఏపీలో రైతుల ముంగిటకే మార్కెట్

Advertisements

<p>రాష్ట్ర వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు&period; రైతులు పండించిన పంటలను&comma; ముఖ్యంగా కూరగాయలు&comma; పండ్లను నేరుగా వినియోగదారుల ఇళ్లకే చేర్చేందుకు ఫార్మ్ టు హోమ్ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు&period; రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చంద్రబాబు సూచించారు&period; దీనివల్ల రైతులకు గిట్టుబాటు à°§à°°&comma; వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు అందుతాయని ఆయన స్పష్టం చేశారు&period; తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం&comma; దాని అనుబంధ రంగాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ దిశానిర్దేశం చేశారు&period; ఈ ఏడాది రాష్ట్రంపై ఎల్ నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి&comma; ప్రాంతాల వారీగా పంటల ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు&period; ప్రతికూల వాతావరణంలోనూ రైతులు నష్టపోకుండా కనీస మద్దతు à°§à°° కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవాలన్నారు&period; రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి&comma; ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని&comma; ఈ విధానంలో విజయం సాధించిన రైతుల అనుభవాలను వినియోగించుకోవాలని తెలిపారు&period; భూసార పరీక్షలు నిర్వహించి&comma; ఆ వివరాలను ఆన్‌లైన్‌లో రైతులకు అందుబాటులో ఉంచాలని&comma; రైతు బజార్లలో ప్రకృతి సేద్య ఉత్పత్తులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు&period; నీటి కొరత ఉన్నచోట్ల పీఎండీఎస్-హాఫ్ మూన్ పద్ధతుల్లో సేద్యం చేపట్టాలన్నారు&period; రాయలసీమను ఉద్యానవన హబ్‌గా మార్చేందుకు రూ&period;40 వేల కోట్లతో పూర్వోదయ పథకం కింద సాగునీటి ప్రాజెక్టులు&comma; రహదారులు&comma; గోదాముల వంటి మౌలిక వసతులు కల్పించనున్నట్టు సీఎం వివరించారు&period; దీనికి తోడు 60 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు&period; తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యడవోలు వద్ద కోకో సిటీ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని సూచించారు&period; జూలై నాటికి మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు&period; పులివెందులలో సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ నిర్మాణాన్ని పూర్తి చేసి&comma; వినియోగంలోకి తెచ్చేందుకు తక్షణమే 3 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు&period; రాయలసీమలో పండే అరటికి ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం కల్పించాలని కూడా అధికారులను ఆదేశించారు&period; వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు క్లస్టర్ల వారీగా ప్రణాళికలు రూపొందించి&comma; రైతు సాధికార సంస్థ ద్వారా హార్వెస్టర్లు&comma; ఇతర యంత్ర పరికరాలు అందించాలని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..