అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇద్దరు చిన్నారుల విన్యాసాలు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇద్దరు చిన్నారుల విన్యాసాలు

Advertisements

<p>సాహసానికి నిలువెత్తు రూపాలు ఆ చిన్నారులు&&num;8230&semi; గుండె నిండా ధైర్యం&&num;8230&semi; ఒళ్లంతా పట్టుదల&&num;8230&semi; ఉంటే వయస్సుతో నిమిత్తం లేదని నిరూపించారు ఆ ఇద్దరు అన్నదమ్ములు&period; అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో పవన్ కల్యాణ్ తన శరీరంపై నుంచి కార్లు&comma; బైకులను పోనిస్తూ చేసిన సాహసాలు గుర్తున్నాయి కదా&&num;8230&semi; సరిగ్గా అలాంటి స్టంట్లతో అనంతపురం జిల్లా తాడిపత్రి ఒక్కసారిగా మార్మోగిపోయింది&period; వంద కార్లు&&num;8230&semi; వంద బైకులు&&num;8230&semi; శరీరంపై నుంచి వెళ్తుంటే&&num;8230&semi; చూసేవారి గుండె ఆగిపోయినంత పనైంతుంటే&&num;8230&semi; ఆ ఇద్దరు చిచ్చర పిడుగులు మాత్రం నవ్వుతూ రికార్డులు కొడుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>అనంతపురం జిల్లా తాడిపత్రిలోని కృష్ణాపురం ఒక అద్భుత ఘట్టానికి వేదికైంది&period; స్థానిక అయాన్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాహస ప్రదర్శనలు వీక్షకులను అబ్బురపరిచాయి&period; అకాడమీకి చెందిన చిన్నారులైన అన్నదమ్ములు లక్కీ&comma; విక్కీలు తమ అసాధారణ ప్రతిభతో తాడిపత్రి సత్తాను ప్రపంచానికి చాటారు&period; చిన్న వయసులోనే వారు ప్రదర్శించిన గుండె నిబ్బరం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది&period; లక్కీ 100 కార్లను&comma; విక్కీ 100 బైకులను తమ శరీరంపై పోనిచ్చుకుని రికార్డు సృష్టించడం తమకు ఎంతో గర్వంగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు&period; గతంలో 100 బల్బులు&comma; 100 పెంకలు పగలగొట్టే సాహసాలు సైతం చేశారన్నారు&period; ఇలాంటి కఠినమైన సాహసాలు చేయాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు పిల్లల్లో అమితమైన ధైర్యం&comma; కఠోర సాధన చాలా అవసరమని&&num;8230&semi; తమ పిల్లలకు శిక్షణ ఇచ్చిన కోచ్ సాయిబాబా మాస్టర్‌కి వారు కృతజ్ఞతలు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>లక్కీ&comma; విక్కీలు ఇద్దరూ అసాధారణమైన ప్రతిభ గల పిడుగులు&period; ఇప్పటికే వీరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్&comma; నోబుల్ వరల్డ్ రికార్డ్స్&comma; సూపర్ కిడ్స్ రికార్డ్స్&comma; ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక రికార్డులను కైవసం చేసుకున్నారు&period; భవిష్యత్తులో ఈ ఇద్దరు చిన్నారులు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్&comma; గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లలో సైతం స్థానం సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నారు&period; ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ à°¶à°¿à°µ గంగధర్ రెడ్డి&comma; లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి&comma; తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి ఆనంద్&comma; తైక్వాండో అసోసియేషన్ ప్రెసిడెంట్ శివయ్య మాస్టర్&comma; కోచ్ సాయిబాబా మాస్టర్ హాజరై చిన్నారులను అభినందించారు&period; ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించడానికి తాడిపత్రి పట్టణ ప్రజలు&comma; చిన్నారుల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో తరలివచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.