నంద్యాల జిల్లా శ్రీశైలం రాజకీయాల్లో మాటల యుద్ధం.

నంద్యాల జిల్లా శ్రీశైలం రాజకీయాల్లో మాటల యుద్ధం

Advertisements

<p>నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి&period; మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి&comma; ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది&period; సవాళ్లు&comma; ప్రతి సవాళ్ల మధ్య తాజాగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి&period; శ్రీశైలం నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి&comma; ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది&period; ఈ నేపథ్యంలో తాజాగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి&&num;8230&semi; శిల్పా చక్రపాణి రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు&period; నియోజకవర్గ అభివృద్ధిపై తాను ఎప్పుడైనా&comma; ఏ వేదికపైనైనా ఆధారాలతో చర్చకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు&period; గత వైసీపీ పాలనలో శ్రీశైలం నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులను చూపించాలని సవాల్ విసిరారు&period; అయితే&comma; ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత స్థాయిలో తీవ్ర హెచ్చరికలు చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది&period; రాజకీయాల్లో విమర్శలు హుందాగా ఉండాలని&comma; హద్దులు దాటితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి&&num;8230&semi; తనపై చేసిన విమర్శలతో పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు&period; తాను ఒక్క సూచన ఇచ్చినా పరిస్థితి మరోలా ఉండేదంటూ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి&period; మరోవైపు&comma; ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది&period; ఇద్దరు నేతల మధ్య కొనసాగుతున్న ఈ రాజకీయ వాగ్వాదంతో శ్రీశైలం నియోజకవర్గంలో రాజకీయ వేడి మరింత పెరిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.