ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క అరెస్ట్ కు వ్యతిరేకంగా రాజీవ్ రహదారిని నిర్బంధించిన BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు.
నరేంద్ర మోడీ (Narendra Modi) దిష్టిబొమ్మ దహనం.
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపుర్ క్యాతన్ పల్లి మున్సిపాలిటీ లోని జాతీయ రహదారిపై ధర్నా అనంతరం మోడీ దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… తెలంగాణ జాతిపిత మన బాపు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్క ని దుర్మార్గంగా నీచాతి నీచంగా ఇంటి సోదా పేరుతో వచ్చి అరెస్టు చేయడం ఒక పిరికిపంద చర్యగా యావత్ తెలంగాణ ప్రజలు భావిస్తారు అన్నారు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరియు యావత్ తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటై బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దామని నీచమైన ఆలోచనతోనే ఇలాంటి ఒక తప్పుడు కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని అందరికీ తెలుసు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కవితక్కని వెంటనే విడుదల చేసి సాక్షాలు ఏమైనా ఉంటే న్యాయపరంగా కొట్లాడాలని సవాల్ చేస్తున్నాం. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ మార్పు మార్పు అని తప్పుడు వాగ్దానాలు చేసి అబ్బాధపు మాటలతో తెలంగాణ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పచ్చగా, సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణని ఈరోజు ఆత్మహత్యల తెలంగాణగా మార్చారన్న విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు.
ఇటు రైతన్నలు, అటు ఆటో డ్రైవర్ అన్నలు మరియు విద్యార్థులు కాంగ్రెస్ పార్టీకి ఏం పాపం చేశారని అడుగుతానాం? నిర్దాక్షంగా వీరందరిని ఆత్మహత్యలు చేసుకోవడానికి మీరు మీ తప్పుడు వాగ్దానాలు కారణం కాదా అని కాంగ్రెస్ పార్టీ నీ ప్రశ్నిస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, గొప్పగా ఆలోచించే వ్యక్తులు మీ యొక్క తప్పుడు వాగ్దానాలని నమ్మి ఓటు వేసి మోసపోయిన విషయాన్ని ముచ్చటగా మూడు నెలల్లోనే తెలుసుకోవడం నిజంగా తెలంగాణ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాము ఖచ్చితంగా త్వరలోనే మీకు చెంప చెల్లు అనేటట్టు బుద్ధి చెప్తారని మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అయినటువంటి బాపు కేసీఆర్ ని బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని భావిస్తాను.
ఇది చదవండి : ఎమ్మెల్సీ కవిత భర్తతో పాటు మరో ముగ్గురికి ఈడీ నోటీసులు
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అధిక మొత్తంలో సీట్లు వస్తాయి అని గమనించి బిజెపి కాంగ్రెస్ రెండు పార్టీలు ఏకమై ప్రజల్ని భయపెట్టి ఓట్లు దండుకుందామని ఆలోచనతోనే ఈ రోజు కవితక్క నీ అరెస్ట్ చేశారు. కానీ తెలంగాణ ప్రజలు భయపడరని ఆ రోజు కేసీఆర్ వెంట ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మేము ఈ రోజు కూడా అదే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి కచ్చితంగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అత్యధికంగా సీట్లు గెలిపించుకొని ప్రజలందరికీ ధైర్యాన్ని నమ్మకాన్ని నింపి ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కవితక్కని వెంటనే విడుదల చేసి న్యాయంగా కోర్టు ద్వారా తేల్చుకోవాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరపున మేమందరం డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్, టౌన్ ఇంచార్జ్ గాండ్ల సమ్మన్న, కేతనపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్, సోషల్ మీడియా ప్రతినిధులు, బీఆర్ఎస్ యూత్ నాయకులు, మహిళ నాయకులు ఉద్యమ నాయకులు రాముడి కుమార్, జాడి శ్రీనివాస్, పోగుల మల్లయ్య,రేవెల్లి ఓదేలు, జిలకర మహేష్, గడ్డం సంపత్, గడ్డం రాజు, బొద్దుల ప్రేమ్ సాగర్, పారుపల్లి తిరుపతి, అనిల్ రావు, పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి