జేవి బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ (JV Builders and Infrastructure Real Estate) :
హైదరాబాద్ ఉప్పల్ లో పెట్టుబడుల పేరుతో జేవి బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ (JV Builders and Infrastructure Real Estate) కంపెనీ సుమారు ఐదు వందల కోట్ల నుండి వెయ్యి కోట్ల వరకూ సామాన్య ప్రజల నుండి వసూలు చేసి బోర్డు తిప్పేయడంతో బాధితులు తమకు న్యాయం చెయ్యాలని ఉప్పల్ పీఎస్ ముందు నిరసన చేపట్టారు. తమ సంస్థ లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఇస్తామని ఆశ చూపి కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ (JV Builders and Infrastructure Real Estate) కంపెనీ యాజమానులు వేలూరి లక్ష్మీ నారాయణ, జ్యోతి దంపతులను అరెస్టు చెయ్యాలని బాధితులు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దీనిపై దృష్టి సారించి తమకు న్యాయం జరిగేటట్లు చూడాలని బాధితులు వేడుకుంటున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కొనుగోలు దారులను మోసం చేసిన జేవీ బిల్డర్స్(JV Builders and Infrastructure Real Estate) ఓనర్స్ వేలూరి లక్ష్మీ నారాయణ, జ్యోతి దంపతులు…
సుమారు 500 మంది ఏజెంట్ లను ఏర్పాటు చేసుకొని, సుమారు 7000 మంది కొనుగోలు దారులను మోసం చేసిన జేవీ బిల్డర్స్(JV Builders and Infrastructure Real Estate) ఓనర్స్ వేలూరి లక్ష్మీ నారాయణ, జ్యోతి దంపతులు. భూమి కొనుగోలు కోసం పెట్టుబడి పథకం ద్వారా అధిక వడ్డీ లాభాన్ని చూపి భారీ మోసం… జనగామ ప్రాంత శివారులో తక్కువ రేట్ లలో భూములు తీసుకొని బై బ్యాక్ ఆఫర్ అని చెప్పి కొంతమందికి ఈ భూమిని గుంట లెక్కన ఫార్మ్ లాండ్ గా రిజిస్ట్రేషన్ చేసారు. కాని చాలా కస్టమర్స్ కి అగ్రిమెంట్ మీదనే మినిమం లక్ష కట్టితే నెలకు 7000/- చొప్పున, 20 నెలలు 140000/- అని కొన్ని నెలలు ఇచ్చి అందరిని మోసం చేసిన వైనం… బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఉప్పల్ పోలీసులు కాగా గతంలో వీరిపై పలు చీటింగ్ కేసులు ఉన్నట్లు తెలుస్తుంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
1 comment
Seems media and people have lost touch with the case. Atleast the media should have followed till they’re either arrested.
Comments are closed.