Khammam District :
ఐదు దశాబ్దాలుగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచు కోటగా నిలుస్తోంది. తేళ్ల లక్ష్మీకాంతమ్మ మొదలు విఠల్ రావు, జలగం కొండళ్ రావు, రంగయ్యనాయుడు, నాదేళ్ల భాస్కరావు, గారపాటి రేణుకాచౌధరి వరకు చెక్కు చెదరని కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి అప్రతిహాత విజయాలను అందించింది. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు అవకాశం కల్పించింది. ఖమ్మం నుండి విజయం సాధించిన తేళ్ల లక్ష్మీ కాంతమ్మ ఇందిరాగాంధికి నమ్మిన బంటుగా కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా నిలిచింది. ఖమ్మం పార్లమెంట్ నుండి విజయం సాధించిన జలగం వెంగళరావు కేంద్రమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా అంతకు ముందు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో కేంద్రంలో కీలక పాత్ర పోషించారు. పివి రంగయ్య నాయుడు సైతం కేంద్రమంత్రిగా పివి నర్సింహారావు మంత్రి వర్గంలో కీలక నేతగా ఎదిగారు. అనంతరం రేణుకా చౌధరి సైతం కేంద్రమంత్రిగా అధినేత్రి సోనియాగాంధి కోటరీలో కీలక పాత్ర పోషించారు. అధికారంలో పార్టీ ఉన్నా లేకున్నా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పట్టు కోల్పోకుండా కంచుకోటాలా నిలిచింది. అదే దారిలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది. గతంలోను నాయకుల మధ్య వైరం ఉన్నప్పటికి అధిష్టానం నిర్ణయమే శిరోదార్యంగా తలవంచేవారు. ఇప్పుడు ఆ పరిస్థితికి తలొగ్గుతారా పార్లమెంట్ సీటు దక్కించుకునే వ్యవహారంలో వర్గాలుగా చీలిపోతారాన్న సంశయం కాంగ్రెస్ ను వెంటాడుతుంది.
Follow us on : Facebook, Instagram & YouTube.
తెలంగాణ ఎర్పడిన తరువాత సైతం రెండు ఎన్నికల్లోను అదే ఒరవడితో కాంగ్రెస్ కే ప్రజానీకం పట్టం కట్టారు. పది నియోజకవర్గాల్లో మిత్ర పక్షం సిపిఐతో కలిసి 9 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఇప్పటి ప్రతిపక్షం బిఆర్ఎస్ అభ్యర్దులు ప్రతి నియోజకవర్గంలో దాదాపు 50 వేలపై చీలుకు ఓట్లతో ఘోర పరాజయం మూట కట్టుకున్నారు. ఇప్పడు కాంగ్రెస్ నాయకుల దృష్టి ఖమ్మం పార్లమెంట్ సునాయసంగా గెలుస్తామనే భరోసాతో మేం పోటీ చేస్థామంటే మేం పోటీ చేస్తామని గల్లి స్థాయి నుండి డిల్లీ స్థాయి నాయకులు ఉబలాటపడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి
మల్లు నందిని ఏకంగా తనకే సీటు కేటాయించాలని ఖమ్మం నుండి ఆరు వందల కార్ల ర్యాలీతో గాంధి భవన్ లో దరఖాస్తు చేసారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరావు తనయుడు యుగంధర్ తన సామాజిక వర్గం కే ఖమ్మం సీటు కేటాయించాలనే డిమాండ్ తో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ ను ఒక్క సీటు గెలవనివ్వనని బీష్మ ప్రతిజ్ఞ నేరవేర్చుకున్న మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి తనకే సీటని స్పష్టమైన సంకేతాలిస్తున్నారు. ముగ్గురు మంత్రుల వారసుల్లో ఖమ్మం పార్లమెంట్ సీటు ఎవరికి కేటాయించినా ఆదిపత్య పోరుకు ఆస్కారం ఏర్పడే అవకాశం ఉండటంతో రాష్ట్ర నాయకత్వం రాహుల్ గాంధిని పోటీ చేయించాలని పట్టుదలతో ఉన్నవార్తలు వినిపిస్తున్నాయి. అధినాయకుడు రాహుల్ ఖమ్మం బరిలో నిలవడం ద్వారా కాంగ్రెస్ లో ఆదిపత్య పోరుకు టిక్ పెడుతుందని భావిస్తున్నారు.
ఖమ్మం నుండి పోటీ చేస్తానని ప్రకటించిన కాంగ్రెస్ పైర్ బ్రాండ్ మాజి కేంద్ర మంత్రి రేణుకా చౌధరిని అధిష్టానం రాజ్యసభకు పంపడంతో ఖమ్మం బిసి నినాదంతో వి.హన్మంతరావు ముందుకు వస్తున్నారనే మాట వినిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో బిసిలకు అసెంబ్లీ సీట్ల కేటాయింపులో అవకాశం ఇవ్వనందున బిసిలకు ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వస్తుంది. మరో వైపు కమ్మ సామాజిక వర్గం నుండి టీపీసీసీ ఉపాధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ సైతం సోటీ చేసే అర్హత ఉందంటూ ముందుకు రావడంతో కాంగ్రెస్ కు ఖమ్మం సీటు కేటాయింపు అగ్ని పరీక్షలా తయారైంది. సునాయసంగా గెలిచే ఖమ్మం పార్లమెంట్ సీటుపై పారిశ్రామిక వేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, పాలేరు టికెట్ ఆశించి బంగ పడ్డ రాయల నాగేశ్వరావు పార్లమెంట్ బరిలో నిలిచేందుకు మొగ్గు చూపుతున్నారు. ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 7 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ గత ఎన్నికల్లో విజయం సాధించడంతో అరడజను మంది పార్లమెంట్ బరిలో నిలిచేందుకు సై అంటూ అంగబలం అర్దబలం సమకూర్చుకునే పనిలో పడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల వరకు అందరం ఒక్కటే అంటూ అంట కాగిన నేతలు పార్లమెంట్ సీటు వ్యవహారంలో నాకు నావారే ముఖ్యమంటు దూరం జరిగారనే ప్రచారం ఖమ్మం జిల్లాను కమ్మేసింది. సార్లమెంట్ సీటు దక్కించుకున్న వారే జిల్లా రాజకీయాలను శాసించే పరిస్థితి ఉండటంతో ముగ్గురు మంత్రులు వారుల కోసం ముమ్మర ప్రయత్నాలు చాప కింద నీరులా ముమ్మరం చేస్తున్నారనే గుసగుసలు ఉన్నాయి. సొంగులేటి సోదరుడు ప్రపాదరెడ్డి కి దక్కకుండా చేయాలనే ప్రయత్నంలో బాగమే కుసుమకుమార్.రాజేంద్ర ప్రపాద్. మల్లు నందినిలు తెరపై కి వచ్చారని వాదన కూడా వినిపిస్తోంది. బిసిలకు కాంగ్రేస్ పార్టీ హ్యాండ్ ఇస్తే దానిని బిఆర్ఎస్ అస్త్రంగా మార్చుకుని ఎన్నికల బరిలో సత్తాచాటలని గులాభి బాస్ వ్యూహం రచిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యభూమిక పోషించిన ఖమ్మం జిల్లా కాంగ్రేస్ లో పొరపొచ్చాలు రాకుండా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందా అన్న ఆశక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.