భువనగిరి పార్లమెంట్ పరిధిలోని తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం అర్వపల్లి మండలం పరిధిలోని అడవివేముల గ్రామంలో గ్రామ దేవత అయిన శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమా ఆటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy venkatreddy) , స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్ మరియు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారు మరియు జిల్లా నాయకులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికలలో మందుల సామేలు గారిని ఏవిధంగానైతే తుంగతుర్తి ప్రజలు 50 వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించారో అదే విధంగా గత 15 సంవత్సరాలుగా ఎన్ఎస్ యు ఐ మరియు యూత్ కాంగ్రెస్ లలో అనునిత్యం పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి ,అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అత్యంత క్రియాశీలకంగా పనిచేసిన మన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని కూడా అదేవిధంగా ఐదు లక్షల భారీ మెజారిటీతో గెలిపించాలని తుంగతుర్తి ప్రజలకు భువనగిరి నియోజకవర్గం కార్యకర్తలు నాయకులు ప్రజలను కోరారు.
కార్యకర్తలు ఇంటింటికి తిరిగి మన అయిదు గ్యారెంటీ ల గురించి వివరించండి ఈ 30 రోజులు కష్టపడండి హస్తం గుర్తుపై ఓటేయాలని ప్రచారం చేయండి చెప్పండి అని అన్నారు. 30 రోజులు మీరు కష్టపడండి 48 నెలలు మేము మీకు అండగా ఉంటాము అర్ధరాత్రి అయినా అపరాత్రి అయిన మీకు ఏ ఇబ్బంది కలిగిన మీ ముంగట ఉంటాము అని భరోసా ఇచ్చారు.అయిదు సంవత్సరాలు మీకు అండగా మేము ఉంటాము మీకు ఏ కష్టం వచ్చినా మంత్రిగా నేను వస్తాను ఎమ్మెల్యే సామెల్ గారు వస్తారు ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డి వస్తారు మా జిల్లా నాయకులు వచ్చి ఆదుకుంటారు.
మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ లాగా దోచుకు తినే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అంటే ఆదుకునే పార్టీ పేద ప్రజలను ఆదుకోవాలని సోనియా గాంధీ గారు ఆనాడు ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి పేద ప్రజలకు కడుపునింపారు అని గుర్తు చేశారు. ఈ 30 రోజులు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలను నాయకులను ప్రజలను కోరారు..
ఇది చదవండి: శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి