ఈ సారి కూడా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ ఎస్ కు గతం కంటే ఇంకో రెండు సీట్లు ఎక్కువే వస్తాయన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ కు వచ్చేది 20 సీట్లేనని చెప్పారు.బీఆర్ఎస్ అభ్యర్థి కమల్రాజును గెలిపిస్తే మధిరలో దళితులందరికీ దళితబంధు ఇస్తామని హామీ ఇచ్చారు. ధరణి స్థానంలో భూమాత పెడతారట. వాళ్లు పెట్టేది భూమాత కాదు.. భూమేత అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ను గెలిపిస్తే.. పదేళ్ల నుంచి కొనసాగుతున్న అభివృద్ధి బ్రహ్మాండంగా ముందుకు పోతుందన్నారు. కాంగ్రెస్ నేతలకు రాష్ట్రం గురించి అవగాహనే లేదని ఆయన విమర్శించారు. ఖమ్మం జిల్లాను ఆనుకొని పారుతున్న గోదావరి నుంచి లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథా అవుతున్నాయని, వాటిని ఒడిసి పట్టి ఖమ్మం జిల్లాకు సాగునీరు అందించాలన్న ఆలోచన కాంగ్రెస్ నాయకులకు ఎందుకు రాలేదని కేసీఆర్ ప్రశ్నించారు. భట్టి విక్రమార్క మధిరను పట్టించుకోలేదని, ఆయనకు ఓటేస్తే నష్టమే జరుగుతుందన్నారు. మంచి ప్రణాళికలతో ముందుకెళ్తున్న బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈసారీ మనమే.. కాంగ్రెస్కు వచ్చేది 20 సీట్లే
56
previous post