ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు ఎంపికకు దరఖాస్తులకు ఆహ్వానం
రెండు తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులకు అవకాశం
దరఖాస్తులు స్వీకరించు చివరి తేదీ 30 మార్చి 2024
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం సంయుక్త అధ్వర్యంలో నిర్వహణ
ఆ సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, అనంచిన్ని వెంకటేశ్వర రావు వెల్లడి
హైదరాబాద్ : “ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు”
ప్రజాస్వామ్యం ఫరిడవిల్లెందుకు, అక్షరాస్త్రాలతో సమాజాన్ని చైతన్య పరిచే, బృహత్తర బాధ్యతను నిర్వర్తిస్తున్న పాత్రికేయులను 2024లో “ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు” ద్వారా సత్కరించి, గౌరవించాలని “తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం” సంయుక్తంగా నిర్ణయించడం జరిగిందని ఆ సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, అనంచిన్ని వెంకటేశ్వర రావు వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అక్షరాన్నే నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న తెలుగు జర్నలిస్టులకు ఈ పురస్కారాల ప్రోత్సాహం ఎంతగానో ఉత్తేజాన్నిస్తుందని, వృత్తి పట్ల మరింత నిబద్ధతను, అంకిత భావాన్ని పాదుకొల్పడానికి దోహదపడుతుందని భావిస్తున్నామన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
జర్నలిస్టు సంఘాలంటే పోరాటాలకు, నిరసనలకు, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యే మూస ధోరణికి పరిమితం కాకుండా జర్నలిస్టులను వృత్తిపరంగా ప్రోత్సాహించే వినూత్న కార్యక్రమానికి గత ఏడాది “తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం” శ్రీకారం చుట్టిందని, రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తరిస్తున్న తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం గత ఏడాది (2023) ఎంతో అద్భుతం గా అందరి సహకారంతో “ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు” ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు నగరంలో నిర్వహించామని మేడవరపు రంగనాయకులు తెలిపారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో “తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం” తో కలిసి సంయుక్తంగా ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
ఇది చదవండి : జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి…
ఎంతో విలువైన ఈ పురస్కారాలను పొందాలని అనుకునే జర్నలిస్టులు మీడియా రంగంలోని వివిధ విభాగాలలో తమరి అర్హతలు పరిశీలించుకుని దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వచ్చిన దరఖాస్తులు స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేసి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉత్తమ జర్నలిస్టులుగా ప్రకటించి ఉగాది పండుగ సందర్భంగా ఎంపిక కాబడిన జర్నలిస్టులకు తెలుగు రాష్ట్రాల ప్రముఖుల చేతులమీదుగా పురస్కారాలు అందించబడతాయని తెలిపారు. దరఖాస్తు చేయువారు తమ దరఖాస్తు చేసుకున్న విభాగం పేరు తప్పనిసరిగా అప్లికేషన్ పై రాసి అన్ని వివరాలు జతచేస్తూ మార్చి 30 సాయంత్రం 7గంటలలోపు పంపేందుకు చివరితేదీగా తెలిపారు. ఇతర వివరాలకు www.tjss.co.in, Email: [email protected], వాట్సప్ నెంబర్ 7036602022 లో సంప్రదించాలని అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, అనం చిన్ని వెంకటేశ్వర రావు సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తెలంగాణ అధ్యక్షులు గజ్జల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గాడిపల్లి పరమేశ్వర్, కోశాధికారి కంచుకట్ల ప్రకాష్, ఉపాధ్యక్షులు మాలి కరుణాకర్, సహాయ కార్యదర్శులు బింగి సత్తయ్య, గిలకత్తుల శ్రీనివాస్, సభ్యులు పులిపలుకుల శివ కుమార్, చౌట బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి