Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Film విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మే 17న విడుదల…

విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మే 17న విడుదల…

by Prakash
విశ్వక్ సేన్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మే 17న విడుదల కానుంది!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన వైవిధ్యమైన పాత్రలు మరియు మాస్ పాత్రలతో తెలుగు సినీ ప్రేమికులలో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఎంతో ప్రతిభ గల ఈ కథానాయకుడు ఇటీవల ‘గామి’తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు ఆయన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే మరో వైవిధ్యమైన సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడినందున, ఈ చిత్రాన్ని 2024 మే 17న వేసవి సెలవులకు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.

ఈ చిత్రంలో అందాల నటి నేహా శెట్టి కథానాయికగా నటిస్తుండగా, ప్రతిభ గల నటి అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు. 1960 లలో గోదావరి జిల్లాలలో చీకటి ప్రపంచంలో సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన హింసాత్మక పాత్రలో విశ్వక్ సేన్ కనిపిస్తారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఆయన స్వరపరిచిన ఆల్బమ్ నుండి విడుదలైన ”సుట్టంలా సూసి” మెలోడీ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాట యూట్యూబ్‌లో 48 మిలియన్ కి పైగా వ్యూస్‌ సాధించి, సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగేలా చేసింది. విశ్వక్ సేన్ అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు, నిర్మాతలు చిత్ర విడుదల తేదీని ఖరారు చేసి వారిలో ఉత్సాహం నింపారు.

ఇది చదవండి : విశాల్ ‘రత్నం’ కోసం ‘డోంట్ వర్రీ రా చిచ్చా’ మంచి మాస్ బీట్ ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాకి వెంకట్ ఉప్పుటూరి, గోపీ చంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కృష్ణ చైతన్య ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు.

అనిత్ మధాడి కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తుండగా, పృధ్వీ యాక్షన్ సీక్వెన్స్‌ల బాధ్యత చూస్తున్నారు. ఈ వేసవిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందిస్తుందని నిర్మాతలు చాలా నమ్మకంగా ఉన్నారు.

మరిన్ని ఫిల్మ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో …
ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.
కళాంకి భైరవుడు ఓ విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్. చేతబడులు, క్షుద్ర పూజలు, …
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.
వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026049
Total views : 149787

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.