రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం..పంచాంగ శ్రవణం అనంతరం ప్రసంగించారు. ఉగాది ప్రధానంగా రైతుల పండుగ అని.. రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుందన్నారు. తెలంగాణలో 70 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయన్న ముఖ్యమంత్రి..రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తుల్ని చేశామన్నారు. రైతులు ఆత్మగౌరవంతో బతికేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతు భరోసా ద్వారా ఇప్పటికే 18వేల కోట్ల రూపాయలిచ్చామని..ఈనెల 22 నుంచి మళ్లీ రైతు భరోసా ప్రారంభమవుతుందని తెలిపారు.
Ugadi
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
శ్రీశైలం (Sri Sailam):
శ్రీశైలం (Sri Sailam)లో ఉగాది మహోత్సవాలను పురస్కరించుకొని ఐదురోజులపాటు జరిగిన ఉగాది మహోత్సవాల ఐదోవరోజైన ఈరోజు శ్రీస్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. శ్రీస్వామివారి యగశాలలో శ్రీచండిస్వారస్వామికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి అనంతరం పూర్ణాహుతి కలశోద్వాసన, త్రిశూలస్నానం, జరిపారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేలాలు, పలు సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు, అర్చకులు సమర్పించి యాగపూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం వసంతోత్సవం జరిపి వసంతోత్సవం తరువాత శ్రీచండీశ్వరస్వామిని పల్లకిలో ఆలయంలో ఊరేగింపుగా ఆలయంలోని మల్లికా గుండం వద్ద తోడ్కొని వచ్చి చండీశ్వరస్వామికి వైదిక శాస్త్రంగా అవభృధస్నానం దేవస్థానం ఈవో పెద్దిరాజు, అర్చకులు, వేదపండితులు నిర్వహించారు.
ఇది చదవండి: తొమ్మిదేళ్ళ పాలనలో బిఆర్ఎస్ చేసిందేమీలేదు..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
శ్రీశైలం దేవస్థానం| Srisailam Temple
నంద్యాల జిల్లా(Nandyal) : శ్రీశైలం ఉగాది మహోత్సవాలలో భక్తుల కల్పిస్తున్న ఏర్పాట్లను పరిశీలించిన ఈవో. మల్లమ్మ కన్నీరు, పార్కింగ్ ప్రదేశాలు యాఫిథియేటర్, ఔటర్ రింగ్ రోడ్డు అధికారులతో కలిసి పరిశీలన. శివరాత్రి కంటే ఎక్కువ చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు. ఉత్సవాలలో దుకాణదారులు అధిక రేట్లకు అమ్మకుండా తనిఖీ చేస్తుండాలని ఈవో ఆదేశాలు. చలువపందిళ్ల వద్ద మంచినీటి అంతరాయం లేకుండా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని ఈవో సూచన. ఉత్సవాల సమయంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు ఆదేశాలు.
Follow us on : Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏప్రిల్ 6 నుండి 10 వరకు ఉగాది ఉత్సవాలు(Ugadi 2024 At Srisailam) దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది
శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుండి 10 వరకు ఉగాది ఉత్సవాలు దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది ఈ ఉత్సవాలకు కర్ణాటక,మహారాష్ట్రల నుండి అధిక సంఖ్యలో వస్తారని అధికారులు అంచనా ఈనేపథ్యంలో భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న ఏర్పాట్లను ఈవో పెద్దిరాజు సంబంధిత అధికారులతో కలిసి పలుచోట్ల పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు యాంపీథీయేటర్, మల్లమ్మకన్నీరు, ఉద్యానవనాలు, పార్కింగ్ ప్రదేశాలు, వలయరహదారి, మొదలైనవాటిని పరిశీలించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే పలుచోట్ల చలువపందిర్లు వేసినప్పటికి ఆయా చలువపందిర్లు పరిశీలిస్తూ ఎండతీవ్రత రోజురోజుకు అధికమవుతున్న కారణంగా వీలైనన్నీ ఆరుబయలు ప్రదేశాలలో భక్తులు సేద తీరేందుకు ఇంకొన్ని చోట్ల చలువపందిర్లను వేయాలన్నారు శివరాత్రి కంటే ఎక్కువగా చలువపందిర్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
చలువపందిర్ల వద్ద అంతరాయం లేకుండా మంచినీటి సరఫరా చేయాలన్నారు మంచినీటికి ట్యాంకర్లనే కాకుండా వాటర్ పాకెట్ల రూపంలో కూడా అందించాలని సూచించారు ఉత్సవాలు సమయంలో క్షేత్రపరిధిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు శౌచాలయాల శుభ్రతపట్ల అవసరమైన చర్యలు తీసుకోవాలని శౌచాలయాలకు నిరంతరం నీటిసరఫరా ఉండేలా చూడాలని తెలిపారు యజ్ఞవాటిక వద్ద గల పార్కింగు ప్రదేశంలో బస్సులు నిలిపేందుకు రీజియన్లు,డివిజన్ల వారిగా సూచికబోర్డులు ఏర్పాటు చేయాలన్నారు ఉత్సవాల సమయంలో దుకాణదారులు వస్తువులను అధికరేట్లకు విక్రయించకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుండాలని సంబంధిత అధికారులను ఈవో పెద్దిరాజు ఆదేశించారు…..
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు ఎంపికకు దరఖాస్తులకు ఆహ్వానం
రెండు తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులకు అవకాశం
దరఖాస్తులు స్వీకరించు చివరి తేదీ 30 మార్చి 2024
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం సంయుక్త అధ్వర్యంలో నిర్వహణ
ఆ సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, అనంచిన్ని వెంకటేశ్వర రావు వెల్లడి
హైదరాబాద్ : “ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు”
ప్రజాస్వామ్యం ఫరిడవిల్లెందుకు, అక్షరాస్త్రాలతో సమాజాన్ని చైతన్య పరిచే, బృహత్తర బాధ్యతను నిర్వర్తిస్తున్న పాత్రికేయులను 2024లో “ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు” ద్వారా సత్కరించి, గౌరవించాలని “తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం” సంయుక్తంగా నిర్ణయించడం జరిగిందని ఆ సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, అనంచిన్ని వెంకటేశ్వర రావు వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అక్షరాన్నే నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న తెలుగు జర్నలిస్టులకు ఈ పురస్కారాల ప్రోత్సాహం ఎంతగానో ఉత్తేజాన్నిస్తుందని, వృత్తి పట్ల మరింత నిబద్ధతను, అంకిత భావాన్ని పాదుకొల్పడానికి దోహదపడుతుందని భావిస్తున్నామన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
జర్నలిస్టు సంఘాలంటే పోరాటాలకు, నిరసనలకు, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యే మూస ధోరణికి పరిమితం కాకుండా జర్నలిస్టులను వృత్తిపరంగా ప్రోత్సాహించే వినూత్న కార్యక్రమానికి గత ఏడాది “తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం” శ్రీకారం చుట్టిందని, రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తరిస్తున్న తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం గత ఏడాది (2023) ఎంతో అద్భుతం గా అందరి సహకారంతో “ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు” ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు నగరంలో నిర్వహించామని మేడవరపు రంగనాయకులు తెలిపారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో “తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం” తో కలిసి సంయుక్తంగా ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
ఇది చదవండి : జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి…
ఎంతో విలువైన ఈ పురస్కారాలను పొందాలని అనుకునే జర్నలిస్టులు మీడియా రంగంలోని వివిధ విభాగాలలో తమరి అర్హతలు పరిశీలించుకుని దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వచ్చిన దరఖాస్తులు స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేసి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉత్తమ జర్నలిస్టులుగా ప్రకటించి ఉగాది పండుగ సందర్భంగా ఎంపిక కాబడిన జర్నలిస్టులకు తెలుగు రాష్ట్రాల ప్రముఖుల చేతులమీదుగా పురస్కారాలు అందించబడతాయని తెలిపారు. దరఖాస్తు చేయువారు తమ దరఖాస్తు చేసుకున్న విభాగం పేరు తప్పనిసరిగా అప్లికేషన్ పై రాసి అన్ని వివరాలు జతచేస్తూ మార్చి 30 సాయంత్రం 7గంటలలోపు పంపేందుకు చివరితేదీగా తెలిపారు. ఇతర వివరాలకు www.tjss.co.in, Email: tjss6602022@gmail.com, వాట్సప్ నెంబర్ 7036602022 లో సంప్రదించాలని అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, అనం చిన్ని వెంకటేశ్వర రావు సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తెలంగాణ అధ్యక్షులు గజ్జల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గాడిపల్లి పరమేశ్వర్, కోశాధికారి కంచుకట్ల ప్రకాష్, ఉపాధ్యక్షులు మాలి కరుణాకర్, సహాయ కార్యదర్శులు బింగి సత్తయ్య, గిలకత్తుల శ్రీనివాస్, సభ్యులు పులిపలుకుల శివ కుమార్, చౌట బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 57003